2024 రేసు : టీడీపీకి అభ్యర్థులు దొరక్కపోవచ్చేమో..

ఆంధ్రప్రదేశ్‌ లో 2024 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే అధికార పక్షం అంతకంతకూ బలపడుతుండగా.. ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీలు కూడా తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫస్ట్ ర్యాంక్ ఎటూ వైసీపీ పార్టీకే కాబట్టి.. మిగతా ర్యాంకుల్లోనే పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం కాగా.. ఆ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే వైసీపీ బాట పడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి […]

Written By: NARESH, Updated On : October 1, 2020 6:13 pm

tdp

Follow us on


ఆంధ్రప్రదేశ్‌ లో 2024 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే అధికార పక్షం అంతకంతకూ బలపడుతుండగా.. ప్రతిపక్షాలైన టీడీపీ, బీజేపీలు కూడా తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫస్ట్ ర్యాంక్ ఎటూ వైసీపీ పార్టీకే కాబట్టి.. మిగతా ర్యాంకుల్లోనే పోటీ నెలకొని ఉంది. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో కొనసాగుతోంది. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం కాగా.. ఆ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే వైసీపీ బాట పడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియకుండా ఉంది.

Also Read: దుర్గగుడిలో మరో అపచారం..

ఎన్నికల నాటికి ఆ సంఖ్య సింగిల్‌ డిజిట్‌ వరకైనా ఉంటుందా లేదా అనేది కూడా డౌట్‌ గానే ఉంది. ఎప్పుడు ఏ నేత.. ఏ పార్టీ వైపు దూకుతాడో తెలియడం లేదు. కనీసం కమ్మ సామాజిక వర్గం కూడా టీడీపీని నమ్మే పరిస్థితిలో లేదు. గెలిచే పార్టీని నమ్ముకుంటే ఉపయోగం ఉంటుంది కానీ, అధికారం లేని పార్టీ.. అందులోనూ ముందు ముందు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా కూడా వేయలేని దాంట్లో ఎవరైనా ఉండగలరా..? కాపులైతే ఎప్పుడో బాబుకి దూరమయ్యారు. మిగతావారిని సామాజిక లెక్కల ప్రకారం బీజేపీ, జనసేన వలేసిపట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల్లో ఓ మోస్తరు పలుకుబడి ఉన్నవారు కూడా టీడీపీతో లేరు. అంటే.. 2024 నాటికి టీడీపీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్‌కి తగులుతుందని తెలిసి కూడా కొంతమంది హస్తం గుర్తుపై పోటీ చేశారు. ఎక్కడివాళ్లక్కడ ఏదో ఒక పార్టీలోకి సర్దుబాటై పోగా మిగులు జనాలు కాంగ్రెస్ తోనే ఉన్నారు.  2019కి వచ్చే సరికి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. అభ్యర్థులే దొరకలేదు. పిలిచి టికెట్ ఇస్తామన్నా కూడా ఎవరూ ముందుకు రాలేదు. సరిగ్గా అదే అనుభవం 2024 నాటికి టీడీపీకి ఎదురు కాబోతోందనేది స్పష్టం అవుతోంది.

Also Read: యూపీ ఉద్రిక్తం.. పోస్టుమార్టంలో దారుణ విషయాలు

టీడీపీలోని ముఖ్య నాయకులంతా ఇప్పటికే మూట సర్దుకుని ఇతర పార్టీల వైపు వెళ్తూనే ఉన్నారు. స్థానిక ఎన్నికల లాంఛనం కూడా పూర్తయితే ఈ కప్పగంతులు బాగానే ఉండేవి. అధికార పక్షంలోకి వెళ్తే కనీసం నామినేటెడ్‌ పోస్టులైనా దొరుకుతాయని ఆశపుడుతున్నారు పలువురు టీడీపీ నేతలు. కార్పొరేషన్, స్థానిక ఎన్నికల్లో పదవుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వైసీపీలో పోటాపోటీ నెలకొనడంతో కొందరు బీజేపీ, జనసేనల వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ ఏవిధంగా చూసినా 2024 నాటికి టీడీపీ ఎలా ఉండబోతోందో ఆ పార్టీ నేతల్లోనూ భయమే కనిపిస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ ఇప్పటికే బలంగా ఉండగా.. బీజేపీ, జనసేనలు కూడా పుంజుకునే పరిస్థితులూ కనిపిస్తున్నాయి.