2021 Political Roundup: కాలగమనంలో మరో ఏడాది కరిగిపోతోంది. 2021 చివరి స్థాయికి చేరుకుంది. కొన్ని రోజుల్లోనే ఇది కూడా కాలగర్భంలో కరిగిపోతోంది. గత ఏడాది కరోనా ప్రభావంతో కకావికలం అయినా ఈ సంవత్సరం మాత్రం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోయింది. వ్యాపారులకు వరం వినియోగదారులకు సైతం మంచి జోష్ నే తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు, జీఎస్టీ వసూళ్లు సైతం దూసుకెళ్లాయి. పెట్రో ధరలు సైతం అమాంతం పెరిగాయి. దీంతో ఆదాయ వ్యయాలు అందరికి అందుబాటులోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
దేశీయ మార్కెట్లు దూసుకెళ్లాయి. కొవిడ్ భయాలున్నా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 60 వేల మైలురాయి దాటి సరికొత్త రికార్డు నెలకొల్పింది. జనవరిలో 50 వేల మార్కు ఉన్న సెన్సెక్స్ సెప్టెంబర్ 24న 60 వేలు దాటడం విశేషం. దీంతో కొవిడ్ నేపథ్యంలో కూడా మార్కెల్ పుంజుకోవడంతో ప్రతికూల ప్రభావాలున్నా రికార్డులు మాత్రం పెరగడంతో సూచీలు మారుమోగాయి.
పెట్రో ధరలు కూడా అమాంతం పెరిగాయి. వినియోగదారుల జేబులు గుళ్ల అయినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయం భారీగానే సమకూరింది. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరగడంతోనే పెట్రో ధరలు పెరిగినట్లు ప్రభుత్వాలు చెబుతున్నా వినియోగదారుల చేతి చమురు మాత్రం వదిలినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా రాష్ర్ట ప్రభుత్వాలు మాత్రం తగ్గించకపోవడం విశేషం.
మరోవైపు బంగారం ధరలు కూడా రెట్టింపయ్యాయి. రూ. 47 వేలు ఉన్న బంగారం మే నెలలో గరిష్టంా 78 వేల కు చేరడం తెలిసిందే. దీంతో బంగారం కూడా ప్రస్తుతం 66 వేలుగా నమోదు కావడం తెలుస్తోంది. కొవిడ్ సమయంలో వడ్డీరేట్లు పడిపోవడంతో స్టాక్ మార్కెట్లు మాత్రం పుంజుకున్నాయి. ప్రజల్లో మదుపుపై అవగాహన పెరుగుతోంది. దీంతో డబ్బు దాచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతోనే స్టాక్ మార్కెట్లు అంతకంతకూ పెరిగిపోతన్నాయి.
జీఎస్టీ వసూళ్లు కూడా భారీగానే పెరగడం గమనార్హం. జనవరిలో జనవరిలో రూ.1.19 లక్షల కోట్లు వసూలు కాగా ఏప్రిల్ లో గరిష్టంగా రూ. 1.39 కోట్లు వసూలు కావడంతో ఖజానా కళకళలాడింది. అత్యధిక స్థాయిలో వసూళ్లు కావడంతో ఖజానా పెరిగింది. మరోవైపు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ తగ్గింది. దీంతో డాలర్ కు రూ. 73గా ఉండటంతో మన రూపాయి పతనం ఎంతలా దిగజారిందో తెలుస్తోంది.
Also Read: Most expensive divorces: చరిత్రలో ఖరీదైన విడాకులు ఏవో తెలుసా?
ఈ ఏడాది టెలికాం రంగం కూడా తన బలం నిరూపించుకుంది. జవసత్వాలు నింపుకుని 5జీ నెట్ వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడులు రాబట్టుకునేందుకు అవకాశం ఏర్పడింది. వినియోగదారుల నుంచి ఆదాయంతో అన్ని కంపెనీలు ఇరవై శాతం ప్రీపెయిడ్ చార్జీలు పెంచుకుని వాటి ఆదాయాన్ని గణంగా పెంచుకున్నాయి. ఇదే సమయంలో వినియోగదారుడికి మాత్రం భారమే కానుంది.
Also Read: NewsX Pre-Poll Survey: న్యూస్ ఎక్స్ ప్రీ పోల్ సర్వే: పంజాబ్ లో ఆప్.. గోవాలో బీజేపీ