https://oktelugu.com/

ప్రతిష్ఠాత్మక దవాఖాన డాక్టర్లకు కరోనా!

ఢిల్లీలో ఉన్న ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ లో డాక్టర్లకు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తెలడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 480 మంది కరోనా పాజిటివ్ అని తేలగా ఇందులో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సులు, 14 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 74 మంది భద్రతా సిబ్బంది, 75 మంది అటెండెంట్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. కరోనా బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో డాక్టర్లు, నర్సులతోపాటు వైద్యసిబ్బంది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 4, 2020 6:20 pm
    Follow us on

    Aiims

    ఢిల్లీలో ఉన్న ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ లో డాక్టర్లకు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తెలడం కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 480 మంది కరోనా పాజిటివ్ అని తేలగా ఇందులో 19 మంది డాక్టర్లు, 38 మంది నర్సులు, 14 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు, 74 మంది భద్రతా సిబ్బంది, 75 మంది అటెండెంట్లు, 54 మంది శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు. కరోనా బారినపడుతున్న వైద్యసిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో డాక్టర్లు, నర్సులతోపాటు వైద్యసిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

    19 డాక్టర్లలో ఇద్దరు ప్రొఫెసర్లు, మిగిలినవారు రెసిడెంట్‌ డాక్టర్లు. కరోనాతో ఈ అత్యున్నత దవాఖానలో ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. ఇందులో ముగ్గురు వైద్య సిబ్బంది ఉండగా, మరొకరు హాస్పిటల్‌ శానిటేషన్‌ సిబ్బందికి ఇన్‌ చార్చి ఉన్నారు. హాస్పిటల్‌ లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని క్వారంటైన్‌ కు తరలించారు.

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో హాస్పిటల్‌ లో మార్చి నెలలో ఔట్‌ పేషెంట్‌ విభాగాన్ని మూసివేశారు. ఇలా ఔట్‌పేషెంట్‌ విభాగాన్ని మూసివేయడం ఎయిమ్స్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.