Jammu and Kashmir Elections 2024 : దాదాపు 10 సంవత్సరాల తర్వాత జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2014లో జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎలక్షన్స్ లో పీడీపీ 28 సీట్లు గెలిచింది. భారతీయ జనతా పార్టీ 25 అసెంబ్లీ స్థానంలో ఘన విజయం సాధించింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో పిడిపి, బిజెపి కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. అయితే ఆ తర్వాత విభేదాలు పొడ చూపడంతో పీడీపీ, భారతీయ జనతా పార్టీ కటీఫ్ చెప్పుకున్నాయి. నేతలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ త్రిబుల్ తలాక్ ను రద్దు చేసింది. అదే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గణనీయమైన మార్పును చూపించింది. ఆ తర్వాత ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. అది జమ్మూ కాశ్మీర్లో పెను సంచలనానికి కారణమైంది. దీంతో ఈసారి జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. జమ్ము కాశ్మీర్లో ప్రజలకు మెరుగైన భద్రత కల్పించామని.. స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశం ఇచ్చామని..లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగరవేశామని బిజెపి నాయకులు చెబుతున్నారు.. మరోవైపు అమర్ నాథ్ యాత్రలో భక్తులకు భద్రత కల్పించాల్సిన దుస్థితి నెలకొందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 24 సెగ్మెంట్లకు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు.. 24 సెగ్మెంట్లలో 16 కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాయి. మిగతా ఎనిమిది జమ్మూ కాశ్మీర్ డివిజన్లో ఉన్నాయి.
కమలం పార్టీకి కష్ట కాలమేనా?
జమ్ము కాశ్మీర్లో జరిగే ఎన్నికల్లో కమలం పార్టీకి కష్టకాలం ఎదురవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాశ్మీర్ లోయలో 47 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 19 మంది అభ్యర్థులను మాత్రమే బిజెపి పోటీలోకి దింపింది. అంటే 28 స్థానాలలో బిజెపి పోటీ చేయడం లేదు. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బిజెపి నాయకులు అంటున్నారు. అని వాస్తవ పరిస్థితి అలా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శ్రీవల్లి పార్లమెంటు ఎన్నికల్లో జంబుకాశ్మీర్ రాష్ట్రంలో బిజెపి అభ్యర్థులను పోటీలో నిలపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సగం కంటే తక్కువ స్థానాలలో అభ్యర్థులను పోటీలో ఉంచడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి..” ముందుగా మేము ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. టికెట్ ఇచ్చినా మీరు ఎన్నికల్లో నెగ్గే పరిస్థితి లేదు. ఇది మా పార్టీ అధిష్టానం నుంచి మాకు వ్యక్తమైన సందేశం. అందువల్లే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. బలహీనంగా ఉన్న స్థానాలలో అభ్యర్థులను నిలిపే అవకాశం లేదని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని” పేరు రాయడానికి ఇష్టపడని బిజెపి నాయకుడు పేర్కొన్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాశ్మీర్ లోయలో అభ్యర్థులను పోటీలో ఉంచలేదు. ఇక జంబులోని రెండు పార్లమెంట్ స్థానాలను బిజెపి దక్కించుకుంది. జమ్ము కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. ఆ సమయంలో కాశ్మీర్ లోయలో చాలా రోజులు నిరసనలు వ్యక్తమయ్యాయి. సమ్మెలు చోటుచేసుకున్నాయి. ఆందోళనలో తగ్గించడానికి భద్రత దళాలు బందోబస్తు పటిష్టం చేశాయి..
ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత..
ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ లోయలో శాంతి ఏర్పడిందని.. సాధారణ జీవితం ఏర్పడిందని బిజెపి ప్రకటించింది. లోయ ప్రాంతంలో తీవ్రవాదుల కదలికలు తగ్గిపోయాయని.. ప్రజలు స్వేచ్ఛ జీవితానికి అలవాటు పడుతున్నారని వివరించండి. ఈ ఏడాది మార్చి నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీనగర్ ప్రాంతంలో పర్యటించారు. ర్యాలీ నిర్వహించారు.. అయినప్పటికీ ఆ ప్రాంతంలో బిజెపి అభ్యర్థులను నిలబెట్టలేదు. ఏకంగా 28 స్థానాలలో అభ్యర్థులను నిలపకపోవడం సరికొత్త విశ్లేషణలకు కారణమవుతోంది. ఇదే విషయంపై బిజెపి జమ్ము కాశ్మీర్ అధికార ప్రతినిధి ఆల్తాఫ్ ఠాకూర్ స్పందించారు. ” అసెంబ్లీ ఎన్నికలు మాకు ఒక పరీక్ష లాంటివి. ప్రస్తుత పరిస్థితుల్లో మేము విజయం సాధిస్తే వచ్చే కాలంలో పోటీలో దిగుతాం. కాశ్మీర్ లోయలో కమలం వికసిస్తుందని నమ్మకం మాకుంది. ఏడు స్థానాలను గెలుచుకుంటామని భావిస్తున్నాం. తక్కువమంది అభ్యర్థులను నిలపడం మా వ్యూహాల్లో ఒక భాగమని”ఆయన వివరించారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: 19 candidates stood for bjp in jammu and kashmir elections 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com