
Pakistan Girl : వ్యసనం ఏడూళ్ళ ప్రయాణం అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న వ్యసనాల్లో సోషల్ మీడియా ప్రధానమైనది. ముఖ్యంగా యువత దీనికి ఎంత ఎడిక్ట్ అయ్యారో చెప్పాల్సిన పనిలేదు. పొద్దస్తమానం ఆన్ లైన్ లో ఉండటం వల్ల దాని ద్వారా అవుతున్న పరిచయాలు యువతను కొత్త లోకం లో విహరించేలా చేస్తున్నాయి. ఫలితంగా వారు దేనికైనా తెగిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. అన్ లైన్ లో పరిచయం అయిన ఓ భారతీయుణ్ణి పెళ్లి చేసుకునేందుకు ఓ పాకిస్తాన్ యువకి ఏకంగా రెండు దేశాలు దాటి వచ్చింది..ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఆమెది పాకిస్తాన్. అతడిది ఇండియా.. ఇద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం. తనను తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పరిచయం చేసుకున్నాడు. అమెనేమో ఇంజనీరింగ్ చదువుతున్నట్టు తెలిపింది.. ఇలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది..ఇద్దరూ చేసుకోవాలి అనుకున్నారు.. దీంతో ఆ పాకిస్తాన్ యువతి ఇండియాకు వచ్చేందుకు ఇండియాకు వచ్చేందుకు రెండు దేశాలు వెళ్లాల్సి వచ్చింది. మొదటగా కరాచి నుంచి దుబాయ్, అక్కడి నుంచి నేపాల్, అక్కడి నుంచి భారత్ వచ్చింది. పాక్ దేశానికి చెందిన 16 ఏళ్ల ఇక్రా అక్కడ ఓ కాలేజీలో చదువుతోంది. అయితే ఆమె లూడో గేమ్ ఆడుతుండగా, భారత్ కు చెందిన ములాయం సింగ్ యాదవ్ (26) పరిచయం అయ్యాడు. అయితే యాదవ్ పేరును సమీర్ అన్సారీ గా చెప్పుకున్నాడు. తాను సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నానని నమ్మబలికాడు. ఇక పాక్ యువతి ప్రేమించడం మొదలుపెట్టింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.
ప్రేమ మైకం లో ఉన్న ఇక్రా తన ప్రియుడిని కలుసుకునేందుకు తెగ ఉబలాటపడింది. ఇందులో భాగంగా ఇండియా వెళ్ళేందుకు తన వద్ద ఉన్న నగలు మొత్తం అమ్మేసింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బు, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో దుబాయ్ కి వెళ్ళింది. అక్కడినుంచి నేపాల్ చేరుకుంది. ములాయం కూడా నేపాల్ వెళ్ళాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండు మంచి యాదవ్.. ఆమెను బెంగళూరు తీసుకొచ్చాడు. అయితే అతను ముస్లిం కాదు, హిందువుని ఇక్రా కు తెలిసిపోయింది. అంతే కాదు తాను సాప్ట్ వేర్ ఇంజనీర్ కాదని, సెక్యూరిటీ గార్డ్ అని తెలుసుకున్నది. అయితే అతడి ప్రేమకు ఫిదా అయిన ఇక్రా.. అతనితోనే ఉండేందుకు సిద్ధమైంది. అయితే ఇటీవల యాదవ్ తన సొంతూరైన ఉత్తర ప్రదేశ్ వచ్చాడు. ఇక్రా యాదవ్ ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.. ఇక్రా, యాదవ్ ను రీఛార్జ్గా జరిగిన విషయం మొత్తం చెప్పారు. మొత్తంగా ఇక్రా ను వారి కుటుంబ సభ్యులకు భారత అధికారులు వాఘా సరిహద్దుల్లో అప్పగించారు. ములాయం ను జైలుకు తరలించారు.