Homeజాతీయ వార్తలుPakistan Girl : వీసా లేకుండా ఎంట్రీ.. భారత్ లోని ప్రియుడి కోసం ఈ పాకిస్తాన్...

Pakistan Girl : వీసా లేకుండా ఎంట్రీ.. భారత్ లోని ప్రియుడి కోసం ఈ పాకిస్తాన్ బాలిక ఏం చేసిందో తెలుసా?

Pakistan Girl :  వ్యసనం ఏడూళ్ళ ప్రయాణం అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న వ్యసనాల్లో సోషల్ మీడియా ప్రధానమైనది. ముఖ్యంగా యువత దీనికి ఎంత ఎడిక్ట్ అయ్యారో చెప్పాల్సిన పనిలేదు. పొద్దస్తమానం ఆన్ లైన్ లో ఉండటం వల్ల దాని ద్వారా అవుతున్న పరిచయాలు యువతను కొత్త లోకం లో విహరించేలా చేస్తున్నాయి. ఫలితంగా వారు దేనికైనా తెగిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. అన్ లైన్ లో పరిచయం అయిన ఓ భారతీయుణ్ణి పెళ్లి చేసుకునేందుకు ఓ పాకిస్తాన్ యువకి ఏకంగా రెండు దేశాలు దాటి వచ్చింది..ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

ఆమెది పాకిస్తాన్. అతడిది ఇండియా.. ఇద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం. తనను తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పరిచయం చేసుకున్నాడు. అమెనేమో ఇంజనీరింగ్ చదువుతున్నట్టు తెలిపింది.. ఇలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది..ఇద్దరూ చేసుకోవాలి అనుకున్నారు.. దీంతో ఆ పాకిస్తాన్ యువతి ఇండియాకు వచ్చేందుకు ఇండియాకు వచ్చేందుకు రెండు దేశాలు వెళ్లాల్సి వచ్చింది. మొదటగా కరాచి నుంచి దుబాయ్, అక్కడి నుంచి నేపాల్, అక్కడి నుంచి భారత్ వచ్చింది. పాక్ దేశానికి చెందిన 16 ఏళ్ల ఇక్రా అక్కడ ఓ కాలేజీలో చదువుతోంది. అయితే ఆమె లూడో గేమ్ ఆడుతుండగా, భారత్ కు చెందిన ములాయం సింగ్ యాదవ్ (26) పరిచయం అయ్యాడు. అయితే యాదవ్ పేరును సమీర్ అన్సారీ గా చెప్పుకున్నాడు. తాను సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నానని నమ్మబలికాడు. ఇక పాక్ యువతి ప్రేమించడం మొదలుపెట్టింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు.

ప్రేమ మైకం లో ఉన్న ఇక్రా తన ప్రియుడిని కలుసుకునేందుకు తెగ ఉబలాటపడింది. ఇందులో భాగంగా ఇండియా వెళ్ళేందుకు తన వద్ద ఉన్న నగలు మొత్తం అమ్మేసింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బు, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో దుబాయ్ కి వెళ్ళింది. అక్కడినుంచి నేపాల్ చేరుకుంది. ములాయం కూడా నేపాల్ వెళ్ళాడు. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండు మంచి యాదవ్.. ఆమెను బెంగళూరు తీసుకొచ్చాడు. అయితే అతను ముస్లిం కాదు, హిందువుని ఇక్రా కు తెలిసిపోయింది. అంతే కాదు తాను సాప్ట్ వేర్ ఇంజనీర్ కాదని, సెక్యూరిటీ గార్డ్ అని తెలుసుకున్నది. అయితే అతడి ప్రేమకు ఫిదా అయిన ఇక్రా.. అతనితోనే ఉండేందుకు సిద్ధమైంది. అయితే ఇటీవల యాదవ్ తన సొంతూరైన ఉత్తర ప్రదేశ్ వచ్చాడు. ఇక్రా యాదవ్ ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.. ఇక్రా, యాదవ్ ను రీఛార్జ్గా జరిగిన విషయం మొత్తం చెప్పారు. మొత్తంగా ఇక్రా ను వారి కుటుంబ సభ్యులకు భారత అధికారులు వాఘా సరిహద్దుల్లో అప్పగించారు. ములాయం ను జైలుకు తరలించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version