Homeఆంధ్రప్రదేశ్‌Rare Minerals: ఏపీలో.. ఫోన్లు, కార్లలో వినియోగించే 15 అరుదైన ఖనిజాలు గుర్తింపు

Rare Minerals: ఏపీలో.. ఫోన్లు, కార్లలో వినియోగించే 15 అరుదైన ఖనిజాలు గుర్తింపు

Rare Minerals
Rare Minerals

Rare Minerals: ఫోన్లు, కార్ల తయారీలో అత్యంత అరుదుగా వినియోగించే 15 రకాలైన ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతున్నట్లు తాజాగా గుర్తించారు. హైదరాబాద్కు చెందిన నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ మేరకు 15 అరుదైన ఖనిజాలకు సంబంధించిన నిక్షేపాలను కొనుగొంది. ఈ కణజాలను సెల్ ఫోన్లు టీవీలతోపాటు కార్లు, ఆటోమొబైల్స్ వంటి పరికరాల్లో వినియోగించేందుకు అనుగుణంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఎన్జిఆర్ఐ సైంటిస్టులు యాత్ర శిలల కోసం ఒక సర్వేను నిర్వహిస్తున్నారు. సర్వే నిర్వహిస్తున్న క్రమంలో లాంతనైడ్ సిరీస్ లోని ఈ ఖనిజాలు గుర్తింపబడినట్లు తెలిసింది. ఈ గుర్తించబడిన మూలకాల్లో అలనైట్, సెరియేట్, థోరైట్, కొలంబైట్, టాంటలైట్, అపాటైట్, జిర్కాన్, మోనాజైట్, పైరోక్లోర్ యుక్సనైట్ ఫ్లోరైట్ ఉన్నట్టు నిర్దారించారు.

ఆయా ప్రాంతాల్లో ఖనిజాలు గుర్తింపు..

నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్త పివి సుందరరాజు మాట్లాడుతూ.. రెడ్డిపల్లె, పెద్దవాడగూరు గ్రామాల్లో వివిధ ఆకృతుల జిర్కాన్‌ను గమనించినట్లు వెల్లడించారు. మోనాజైట్ ధాన్యాలు రేడియల్ పగుళ్లతో, పలు రంగుల్లో ఉండడాన్ని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఇది రేడియోధార్మిక మూలకాల ఉనికిని సూచిస్తోందని ఆయన తెలిపారు.

డ్రిప్ డ్రిల్లింగ్ ద్వారా మరింత అధ్యయనం..

రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గురించి మరింత తెలుసుకోవడానికి డీప్‌ డ్రిల్లింగ్ ద్వారా మరిన్ని లోతుగా అధ్యయనాలు నిర్వహించడానికి సైంటిస్టుల బృందం సిద్ధమవుతోంది. ఈ మూలకాలు క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్, శాశ్వత అయస్కాంతాల తయారీలో కూడా ఉపయోగించబడతాయి. ఆధునిక ఎలక్ట్రానిక్స్ యొక్క కీలక భాగం – విండ్ టర్బైన్లు, జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ తోపాటు అనేక ఇతర ఉత్పత్తులు తయారవుతాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వాటి ప్రకాశించే, ఉత్ప్రేరక లక్షణాల కారణంగా అధిక సాంకేతికతలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. ఆల్కలీన్ సైనైట్‌లో మెటలోజెని కోసం చిక్కులతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు.

అక్కడ ఉన్నట్టు నిర్ధారణ..

మెటలోజెని అనేది ఒక ప్రాంతం యొక్క భౌగోళిక చరిత్ర. దాని ఖనిజ నిక్షేపాల మధ్య జన్యు సంబంధాన్ని వివరించే భూగర్భ శాస్త్రం యొక్క శాఖ. ఆల్కలీన్ కాంప్లెక్స్‌లు అనంతపురం జిల్లాలోని పాలియోప్రొటెరోజోయిక్ కడప బేసిన్‌కు పశ్చిమ, నైరుతి దిశలో ఉన్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు.

Rare Minerals
Rare Minerals

గతంలోనే గుర్తింపబడినట్లు చెబుతున్న అధికారులు..

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో నివేదించిన అంశాలు ఆధారంగా చుస్తెబానేక అనేక ఆల్కలీన్ సైనైట్ నిక్షేపాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే ప్రస్తుతం మాత్రం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్
మళ్లీ ఈ ప్రాంతంలో పరిశీలన సాగిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని దంచెర్ల, పెద్దవడుగూరు, దండువారిపల్లె, రెడ్డిపల్లె చింతలచెర్వు, పులికొండ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ బేరింగ్ ఖనిజాలు భారీగా ఉన్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా దంచెర్ల సైనైట్ అంతా ఓవల్ ఆకారంలో 18 చదరపు కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత పరిశోధన కోసం వందనమోనాలను ఇప్పటికే సైంటిస్టులు సేకరించి పరిశోధన సాగిస్తున్నారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మినరాలైజేషన్ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ అనుమానాలపై పరిశోధన సాగిస్తున్నట్లు సైంటిస్టులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular