
Journalist Karan Thapar: “రాహుల్ గాంధీ మారాడు. భవిష్యత్తు ఆశా కిరణంగా కనిపిస్తున్నాడు. మోదీని ఎదిరించగలడు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలడు. వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి పూర్వ వైభవం తేగలడు” పార్లమెంటు నిషేధం విధించిన తర్వాత రాహుల్ గాంధీ మీద సెక్షన్ మీడియా కురిపిస్తున్న ప్రేమ ఇది.. ఇదంతా జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచిదే. బిజెపి పార్టీకి కూడా మంచిదే. అంటే ఇలాంటి పరిణామం ఒక గుణపాఠంగా మిగులుతుంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెబుతుంది.. కానీ రాహుల్ గాంధీ మారలేదు.. అతడు ఇంకా దిగజారి పోయాడు.. మాట అంటున్నది ఎవరో కాదు.. ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్. ఈయనేమీ మోదీ ఇష్టుడు కాదు..కాంగ్రెస్ కమ్ లెఫ్ట్ భావాలు ఉన్న పాత్రికేయుడు.. అలాంటి ఈయన రాహుల్ గాంధీ మీద ఒక పెద్ద వ్యాసమే రాశాడు.
” ఓ బి సి కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానించాడని బిజెపి ఆరోపిస్తోంది. మీ అభిప్రాయం ఏమిటి అని” రాహుల్ గాంధీని ఓ జర్నలిస్టు అడిగాడు. దానికి రాహుల్ గాంధీ” నువ్వు బిజెపికి ఎందుకు ఇంత నేరుగా పనిచేస్తున్నావు? నీకు కాషాయ పార్టీ నుంచి ఆదేశాలు ఏమైనా అందాయా? నువ్వు బిజెపి కోసం పని చేయాలి అనుకుంటే వారి జెండా లేదా పువ్వు గుర్తును తెచ్చుకొని నీ చాతిపై పెట్టుకో. వారికి ఏ రీతిలో జవాబులు చెప్పానో, నీకు కూడా అలానే చెబుతాను. అంతే తప్ప పాత్రికేయుడిగా నా ముందు యాక్టింగ్ చేయకు” కేవలం ఈ మాటలు మాత్రమే కాదు.. తన అసహనానికి గుర్తుగా, అందరూ వినేటట్టుగా” గాలి పోయింది” అని అర్థం వచ్చేలా సదరు జర్నలిస్టును మరింత వెటకారం చేశాడు.. అంతే రాహుల్ గాంధీ ముఖం తెగ వెలిగిపోయింది. ఇలా రాసుకోచ్చాడు కరణ్. కెసిఆర్, కేటీఆర్ ఇంతకంటే దారుణంగా మాట్లాడుతారు మీకు తెలుసా అనే ప్రశ్న వేయకండి. అది వేరే చర్చ.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. తను ఒకసారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు.. రాహుల్ తన కుక్కలతో ఆడుకుంటూ హిమంతను లైట్ తీసుకున్నాడు. ఇది హిమంతకు కోపం తెప్పించింది. తర్వాత ఏమైంది? అస్సాం కాంగ్రెస్ నుంచి జారి పోయింది. అంటే రాహుల్ గాంధీలో అప్పుడు ఎలాంటి పరిణతి ఉందో, ఇప్పుడు కూడా ఉంది అనేది కరణ్ థాపర్ ఉద్దేశం.

“ఇదే కాదు 2013లో మన్మోహన్ ప్రభుత్వం లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఏదైనా నేరానికి సంబంధించి చట్టసభ సభ్యులకు శిక్ష పడితే, వెంటనే అనర్హత వేటు పడకుండా.. 90 రోజుల లోపు పున: సమీక్ష కోరుతూ కోర్టులో అప్పీల్ చేసుకుంటే, అనర్హతను వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు అనేది ఆ ఆర్డినెన్సు సారాంశం. కానీ ఆ కాపీని అందరి ముందు చించేసాడు. ప్రధానిగా మన్మోహన్ స్థాయిని దిగజార్చాడు. మొన్నటి ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ ఆర్ జర్నలిస్టుకు సారీ చెప్పి ఉండాల్సింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ కు కూడా సారి చెప్పి ఉండాల్సింది.. మేము గాంధీలం. క్షమాపణలు చెప్పం. అనే తల బిరుసుతనం రాహుల్ గాంధీ లోని అపరిపక్వతను బహిర్గతం చేస్తోంది.” అని కరణ్ ముక్కుసూటిగా చెప్పేశాడు.
వాస్తవానికి రాహుల్ కుటుంబానికి గాంధీ అనే ఇంటి పేరుకు సంబంధం లేదు. అది రాజకీయ లబ్ధి కోసం, గాంధీ ఇమేజ్ ని హైజాక్ చేసేందుకు ఉద్దేశించిన పేరు మార్పిడి పథకం.. అందుకే ప్రియాంక కూడా ప్రియాంక వాద్రా గా కాదు, ప్రియాంక గాంధీగా స్థిరపడిపోయింది. అచ్చం సోనియా గాంధీ లాగే.. మేము క్షమాపణలు చెప్పం, అని గర్వంగా చెప్పుకున్న రాహుల్ గాంధీ గతంలో కోర్టులకు బోలెడు సార్లు క్షమాపణలు చెప్పుకున్నాడు.. అంతేకాదు గతంలో ఆర్ఎస్ఎస్ మీద చేసిన వ్యాఖ్యల మీద, సావర్కర్ మీద తూలిన మాటల మీద రాహుల్ పై కేసులున్నాయి. ఏమయ్యా రాహుల్.. ఈ తెలిసి తెలియని మాట తీరుతో మోదీ ని ఎలా ఢీ కొడతావ్.. కొంచెం మారు భయ్యా! దేశం నీకోసం చూస్తోంది!