Homeజాతీయ వార్తలుDemonetisation: మోడీ పేల్చిన బాంబ్‌కు 9 ఏళ్లు.. నాటి రోజులు భయానకం

Demonetisation: మోడీ పేల్చిన బాంబ్‌కు 9 ఏళ్లు.. నాటి రోజులు భయానకం

Demonetisation: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయింది. 12వ ఏట అడుగు పెట్టింది. ఇక నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డు సమం చేశారు. ఇక తమ పాలనలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని బీజేపీ నాయకులు చెప్పుకుంటారు. అయోధ్య రామాలయం, రహదారుల విస్తరణ, ఆర్టిక్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు.. ఆత్మనిర్భర్‌ భారత్, మేకిన్‌ ఇండియా, జీఎస్టీ తదితర కార్యక్రమాలను గొప్పగా ప్రచారం చేసుకుంటారు. అయితే మోదీ పాలనలో 2016, నవంబర్‌ 8 ఒక చీటకి రోజుగా మారింది. ఆరోజు రాత్రి ‘మేరే ప్యార్‌ దేశ్‌వాసియో’ అంటూ మోదీ ప్రకటించిన కీలక నిర్ణయం కోట్ల మందికి శాపంగా మారింది. బ్లాక్‌మనీ రద్దు, విదేశాల్లోని నల్లధనం దేశంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మోదీ ఆరోజు పెద్ద నోట్లు(రూ.500, రూ.1,000) రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్దేశం మంచిదే అయినా అధి పేద, మధ్యతరగతికి శాపంగా మారింది. ఇదే సమయంలో నల్లధనం దేశంలోకి రాలేదు. బ్లాక్‌ మనీ వెలికి తీయలేదు. దీంతో మోదీ లక్ష్యం నెరవేరలేదు. మోదీ ప్రకటనతో దేశంలో ఉన్న మొత్తం నగదు లో దాదాపు 86% ఒక్కసారీగా విలువ కోల్పోయింది. రాత్రి నుంచి బ్యాంకులు, ఏటీఎంల ముందుకు జనాలు క్యూ కట్టారు. ఉద్యోగులు, రైతులు, చిన్నా పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆస్పత్రులకు వెళ్లడం, పిల్లలకు టిఫిన్, వ్యాపారాలు లావాదేవీలు – అన్నీ వద్దన్నట్టయ్యాయి. ప్రజా జీవితం ఒక్కపుడు తారుమారు అయింది.

మార్పు కోసం ప్రయత్నమా?
ప్రభుత్వం చెప్పిన ముఖ్య ఉద్దేశాలు – బ్లా్లక్‌ మనీకి అడ్డుకట్ట, నకిలీ నోట్ల నిర్మూలన, ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌ మార్గాన్ని ప్రోత్సహించడం. విదేశాల్లోని నల్లధనం దేశంలోకి తీసుకురావడం. కానీ అధికారిక డేటా ప్రకారం రూ. 15.41 లక్షల కోట్లలో 99.3% మళ్లీ బ్యాంకుల్లొకి తిరిగి వచ్చాయి. అంటే బ్లాక్‌ మనీ అంతా బయటపడలేదు అన్నది స్పష్టమైంది. ప్రారంభ డిజిటల్‌ శాతం పెరగినా, దీన్ని కొనసాగించే స్థాయిలో కాదు.

ఇప్పటికీ మోదీ స్పీచ్‌తో దేశం అలర్ట్‌..
పెద్దనోట్ల రద్దు ప్రసంగం తర్వాత మోదీ కరోనా సమయంలోనూ ఐదారుసార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అవి కూడా ప్రజలను అప్రమత్తం చేసే ప్రసంగాలే లాక్‌డౌన్, లాక్‌డౌన్‌ కొనసాగింపు, వ్యాక్సిన్‌ తయారీ, వ్యాక్సినేషన్‌కు సంబంధించి సాగాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగం అంటే ప్రజల్లో అపోహ, అప్రమత్తతగా మారిపోయింది. అప్పటి అనుభవాలు, తుది ఆర్థిక ప్రయోజనంపై సంశయాలు కొనసాగుతున్నాయి.

ఆర్థిక నిపుణుల వ్యతిరేకత..
మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఆర్థిక నిపుణలు తప్పు పట్టారు. నగదు దొరకడం కష్టం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఏటీఎంల ముందు క్యూకట్టారు. కొందరు మరణించారు. దీంతో విపక్షాలు.. ‘‘ఇది సాధారణ ప్రజల నమ్మకాన్ని కోల్పోయే నిర్ణయం’’, ‘‘వ్యవస్థపై విశ్వాసం తీయడం’’ అంటూ విమర్శించాయి. దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలు, వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ఉద్యోగాలు పోయాయి. మధ్య తరగతి, పేదలు ఎక్కువగా దెబ్బతిన్నారు.

నగదు తుది లెక్కలా తేలినా.. కష్టపడింది సామాన్య ప్రజలే, ప్రయోజనం తక్కువ, భావోద్వేగాలు ఎక్కువ. కానీ, ఆ అర్ధరాత్రి ‘‘మేరే ప్యారే దేశవాసియో’’ అంటూ దేశాన్ని జగన్‌లోకి నెట్టిన ఆ ఒక్క సోల డెసిషన్‌ వ్యవస్థపై ప్రజల్లో అప్రమత్తతను గట్టిగా బాగా నేర్పింది. మోదీ పేల్చిన ఆర్ధిక బాంబుకు తొమ్మిదేళ్లు పూర్తయింది. అప్పటి ఇబ్బందులు ఇప్పటికీ దేశ ప్రజల కళ్లముందు కదలాడుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version