AP 10th class Results : 71 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలే!.. ఇది మన ఏపీ ప్రభుత్వ పాఠశాలల షాకింగ్ ఫలితాలు..!

AP 10th class Resultsపేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా మారింది ఏపీ ప్రభుత్వ విద్య తీరు. ఏపీ సీఎం జగన్ ‘నాడు నేడు’ పేరిట ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేశాడు. ఇక నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించేందుకు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు. పాఠశాలలకు పిల్లలు రావడానికి వారికి ‘అమ్మఒడి’ పథకం కింద ఏడాదికి 15 వేల వరకూ ఇస్తున్నారు. విద్యార్థులు బడికి తప్పించకుండా హాజరును బట్టి ఈ మొత్తాన్ని అందజేస్తున్నారు. ఇన్ని కోట్ల […]

Written By: NARESH, Updated On : June 6, 2022 7:47 pm
Follow us on

AP 10th class Resultsపేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా మారింది ఏపీ ప్రభుత్వ విద్య తీరు. ఏపీ సీఎం జగన్ ‘నాడు నేడు’ పేరిట ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చేశాడు. ఇక నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించేందుకు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టారు. పాఠశాలలకు పిల్లలు రావడానికి వారికి ‘అమ్మఒడి’ పథకం కింద ఏడాదికి 15 వేల వరకూ ఇస్తున్నారు. విద్యార్థులు బడికి తప్పించకుండా హాజరును బట్టి ఈ మొత్తాన్ని అందజేస్తున్నారు.

ఇన్ని కోట్ల నిధులు పంచి.. ఇంత విద్యార్థుల కోసం వెచ్చించినా కానీ మన ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల తలరాత మారడం లేదు. తాజా పదోతరగతి ఫలితాల్లో 71 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాకపోవడం షాకింగ్ గా మారింది. ఇది మన ప్రభుత్వ విద్య అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఏపీ పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈ ఫలితాల్లో ఊహించని పరిమాణం చోటు చేసుకుంది.

రాష్ట్రంలోని 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఒక్క విద్యార్థి కూడా పాస్ కానీ పాఠశాలలు దాదాపు 71 ఉన్నాయని మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఒక్క విద్యార్థి కూడా పాస్ కాకపోవడంతో.. ఆ స్కూల్ యాజమాన్యాలు షాక్‌లో మునిగిపోయాయి.

71 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాకపోవడం ఉపాధ్యాయులు పాఠాలు సరిగా చెప్పకపోవడమా? లేదా విద్యార్థులే సరిగా చదవకపోవడం వల్లనా? లేక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందా? అన్నది అంతుబట్టడం లేదు. కానీ ఇన్ని స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాకపోవడం మాత్రం ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చింది.జగన్ కోట్లు కుమ్మరిస్తున్నా.. ప్రభుత్వ విద్య ఇంత దారుణమా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి…!!