ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఈసారి ఆయన పుట్టినరోజు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని టీఆర్‌ఎస్ నేతలు ప్లాన్ చేశారు. ఇందుకు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. కేసీఆర్‌కు వ్యవసాయం, మొక్కల పెంపకం అంటే ప్రీతి. దీంతో ఆ దిశగానే ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలని తలిచారు. ఆయన పుట్టిన రోజు నాడు.. రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని డిసైడ్ చేశారు.
Also Read: వరుస భేటీలు స్టార్ట్ చేసిన షర్మిల..: పార్టీ ప్రకటన అప్పుడే..?
రేపే కేసీఆర్ బర్త్ డే కావడంతో టీఆర్ఎస్ నేతలు చాలా చురుకుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ ఇనిషియేటివ్‌ను సీఎం కేసీఆర్ సమీప బంధువు.. ఎంపీ సంతోష్ కుమార్ తీసుకున్నారు. ఆయన కొద్ది రోజులుగా మొక్కల చాలెంజ్ నిర్వహిస్తున్నారు. ఓ అడవిని దత్తత తీసుకోవడమే కాదు.. ప్రభాస్ లాంటి నటులతో దత్తత తీసుకనేలా చేశారు. ఆయన పిలుపునిచ్చిన కారణంగా టాలీవుడ్ బాలీవుడ్ నటులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు కూడా.
ఇప్పుడు.. ఆయన చొరవతోనే సెలబ్రిటీలు కూడా కేసీఆర్ పుట్టిన రోజుకు కోటి మొక్కల కానుక ఇద్దామని.. అందులో భాగస్వాములై తలా ఓ మొక్క నాటాలని పిలుపునిస్తున్నారు. అయితే కోటిమొక్కలు ఒక్క తెలంగాణలో అయితేనే సాధ్యం కాదు కాబట్టి ఏపీని కూడా లెక్కలో వేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో బాధ్యత తీసుకుంటుననట్లుగా కనిపిస్తోంది.
Also Read: ఏదో అనుకుంటే మరేదో చేశారు..: నిమ్మగడ్డ నిర్ణయంపై విపక్షాల ఫైర్
ఎమ్మెల్యే రోజా ఈ మేరకు పిలుపునిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. బహుశా ఆమె తన నగరి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ పుట్టిన రోజు కారణంగా మొక్కలు నాటిస్తారేమో అన్న చర్చ జరుగుతోంది. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఇనిషియేటివ్‌లో భాగమై కేసీఆర్ పుట్టిన రోజు మొక్కలను ఏపీలో ఏపుగా పెంచుతారేమో చూడాలి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్