సంతోష్ బాబుకి కేసీఆర్ ఘన నివాళి

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రుడైన సూర్యాపేట బిడ్డ క‌ల్న‌ల్ బిక్కుమ‌ల్ల సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ‌లో ఆయ‌న మ‌ర‌ణించ‌డం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం.. ఆయ‌న కుటుంబానికి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు […]

Written By: Neelambaram, Updated On : June 17, 2020 3:38 pm
Follow us on


భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రుడైన సూర్యాపేట బిడ్డ క‌ల్న‌ల్ బిక్కుమ‌ల్ల సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ‌లో ఆయ‌న మ‌ర‌ణించ‌డం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం.. ఆయ‌న కుటుంబానికి ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతీ కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ల‌ఢ‌ఖ్‌ లోని గాల్వాన్ లోయ వ‌ద్ద సోమ‌వారం రాత్రి స‌మ‌యంలో అక‌స్మాత్తుగా చైనా సైనికులు భార‌త భూభాగంలోని మ‌న జ‌వాన్ల‌పై దాడికి పాల్ప‌డ్డారు. రాళ్లు, ఇనుప రాడ్ల‌తో కొట్లాట‌కు దిగడంతో ప్ర‌తిఘ‌టించారు భార‌త జ‌వాన్లు. ఈ స‌మ‌యంలో ప‌ర‌స్ప‌రం హోరాహోరీగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో భార‌త ఆర్మీ క‌ల్న‌ల్ సంతోష్ స‌హా మ‌రో ఇద్ద‌రు సైనికులు అమ‌రుల‌య్యారు. మ‌న జ‌వాన్ల ప్ర‌తి ఘ‌ట‌న‌లో చైనాకు చెందిన సైనికులు కూడా న‌లుగురైదుగురు మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది.