ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసే మాధ్యమాల్లో మీడియా ముందు వరసలో ఉంటుంది. అయితే.. మీడియా ఇవాళ ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. రాజకీయ ప్రయోజనాలు మీడియాను చుట్టేశాయి. పార్టీకో మీడియా సంస్థ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల మీడియా సంస్థలు.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ల మీడియా సంస్థలు నిజాలు మాట్లాడుతాయని, మిగిలిన సమయంలో మౌనాన్ని ఆశ్రయిస్తాయనే అపవాదు కూడా తెలుగు మీడియాపై ఉంది.
అయితే.. ప్రస్తుతం ఏపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను కొన్ని మీడియా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ఓ మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టు మూర్తి కొంతకాలంగా ఆ టీవీలో కనిపించట్లేదు. దీంతో.. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. ఆ యాజమాన్యం మూర్తిని పక్కన పెట్టిందని, నిధుల దుర్వినియోగం కారణంగా ఉద్యోగం నుంచి తీసేశారని ఇలా.. ఏవేవో ప్రచారాలు కూడా చేశారు.
ఈ పరిస్థితి శృతిమించడంతో అనివార్యంగా ప్రత్యక్షమైన మూర్తి.. కారణాలు వివరించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం సెలవు తీసుకున్నానని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ కారణాలు, మరే ఇతర కారణాలు లేవని క్లారిటీ ఇచ్చారు. కానీ.. ఆ వ్యక్తిగత రీజన్స్ ఏంటన్నది మాత్రం చెప్పలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన తల్లిదండ్రుల సంరక్షణలో భాగంగా ఈ సెలవు పెట్టినట్టుగా చెబుతున్నారు.
ఆ విధంగా.. మరికొన్నాళ్లపాటు స్క్రీన్ పై కనిపించే అవకాశం లేదని చెప్పారు. అయితే.. అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం మాత్రం.. ట్రోలింగ్ నడిపిస్తూనే ఉందని అంటున్నారు. మరి, మూర్తి తిరిగి ఎప్పుడు వస్తారు? అన్నది చూడాలి.