https://oktelugu.com/

మావోలకు వ్యతిరేకంగా గిరిజనుల ర్యాలీ..!

తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని చింతూరు ఏజన్సీలో గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం చర్చనీయంగా మారింది. సహజంగా గిరిజనులకు, మావోయిస్టులకు సత్సంబంధాలు ఉంటాయి. మావోయిస్టులకు గిరిజనులు కొన్ని సందర్భాల్లో సహకారాన్ని అందిస్తారు. చింతూరు సమీపంలో వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు చేస్తున్న వారిని బెదిరించి, అక్కడున్న రెండు జేసీబీలు, లారీలు, ట్రాక్టర్ లు, కాంక్రీట్ మిసక్సర్ ను మావోయిస్టులు తగులబెట్టారు. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గిరిజనులు మావోలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 8, 2020 / 05:42 PM IST
    Follow us on


    తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని చింతూరు ఏజన్సీలో గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రదర్శన చేయడం చర్చనీయంగా మారింది. సహజంగా గిరిజనులకు, మావోయిస్టులకు సత్సంబంధాలు ఉంటాయి. మావోయిస్టులకు గిరిజనులు కొన్ని సందర్భాల్లో సహకారాన్ని అందిస్తారు. చింతూరు సమీపంలో వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు చేస్తున్న వారిని బెదిరించి, అక్కడున్న రెండు జేసీబీలు, లారీలు, ట్రాక్టర్ లు, కాంక్రీట్ మిసక్సర్ ను మావోయిస్టులు తగులబెట్టారు. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గిరిజనులు మావోలకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు.

    చింతూరు మన్యంలో సోమవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల ఈ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని తుమ్మల గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకట్రామపురం గ్రామస్థులు ఆ గ్రామం నుండి బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ప్రదేశంలో ప్ల కార్డులు పట్టుకొని ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామస్థులు మాట్లాడుతూ మా బ్రిడ్జ్ పనులు అడ్డుకోవద్దని కోరారు. ఈ వర్షాకాలంలో మా ప్రాణాలు గాలిలో కలవకుండా అధికారులు బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చూడాలని కోరారు.