మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అప్పుడే?

దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14తో మొదటి విడుదల లాక్డౌన్ ముగిసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం మరోసారి లాక్డౌన్ గడుపు మే3వరకు పొడిగించింది. దేశంలో కరోనా కట్టడి, లాక్డౌన్ సడలింపుపై సోమవారం ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనేపథ్యంలో లాక్డౌన్ పొడగించినట్లయితే మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరినట్లు సమాచారం. ఈ విషయలో కేంద్రం కూడా సానుకూలంగా […]

Written By: Neelambaram, Updated On : April 28, 2020 1:08 pm
Follow us on


దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14తో మొదటి విడుదల లాక్డౌన్ ముగిసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం మరోసారి లాక్డౌన్ గడుపు మే3వరకు పొడిగించింది. దేశంలో కరోనా కట్టడి, లాక్డౌన్ సడలింపుపై సోమవారం ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనేపథ్యంలో లాక్డౌన్ పొడగించినట్లయితే మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరినట్లు సమాచారం. ఈ విషయలో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మే3 తర్వాత లాక్డౌన్ పొడగించినప్పటికీ మద్యం అమ్మకాలను గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

లాక్డౌన్ కారణంగా ప్రజారవాణా స్తంభించిపోయింది. నిత్యావసర సరుకుల షాపులు మినహా అన్ని బంద్ అయ్యాయి. మద్యంప్రియులకు మద్యందొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు మద్యం షాపుల్లో చోరిలకు పాల్పడటం చేస్తున్నారు. ఇంకొందరు మద్యందొరకక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు వెలుగుచూశాయి. మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయింది. ఈనేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. మద్యం అమ్మకాల వల్ల ఆదాయం విషయంలో కొంత ఉపశమనం కలుగుతుందని సీఎంలు భావిస్తున్నారు. ఈమేరకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్లు సీఎంలు పేర్కొంటున్నారు.

ప్రజారవాణాలో మాత్రం యథావిధిగా ఆంక్షలు కొనసాగుతాయని ముఖ్యమంత్రులు చెబుతున్నారు. బస్సులు, విమాన, రైళ్ల సర్వీసులను ఇప్పట్లో సడలించే అవకాశాలు కన్పించడం లేదని చెబుతున్నారు. విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, జనసంచారం ఉండే ప్రాంతాలపై లాక్డౌన్ కొనసాగింపు ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించే విషయాన్ని కేంద్రం పరిశీలిందని తెలిపారు. లాక్డౌన్‌ కొనసాగింపుపై ఈ వారాంతంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎంలు పేర్కొంటున్నారు.