బ్రేకింగ్ న్యూస్.. మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగింపు

దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ అమలుకే కేంద్రం మొగ్గుచూపింది. మే 17వరకు లాక్డౌన్ కొనసాగించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. మే3తో రెండోవిడుత లాక్డౌన్ ముగిస్తుండగా మరోసారి కేంద్రం లాక్డౌన్ పొడగించింది. అయితే ఈమేరకు కేంద్రం తాజాగా ప్రకటించిన రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులిచ్చింది. గ్రీన్ జోన్లలో అన్నిరకాల కార్యకలాపాలకు కేంద్రం అనుమతిచ్చింది. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే? ఆరెంజ్ జోన్లలో కొన్ని షరతులతో కార్యకలాపాలకు అనుమతిచ్చింది. ఇక రెడ్ జోన్లు, […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 7:03 pm
Follow us on


దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ అమలుకే కేంద్రం మొగ్గుచూపింది. మే 17వరకు లాక్డౌన్ కొనసాగించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. మే3తో రెండోవిడుత లాక్డౌన్ ముగిస్తుండగా మరోసారి కేంద్రం లాక్డౌన్ పొడగించింది. అయితే ఈమేరకు కేంద్రం తాజాగా ప్రకటించిన రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులిచ్చింది. గ్రీన్ జోన్లలో అన్నిరకాల కార్యకలాపాలకు కేంద్రం అనుమతిచ్చింది.

భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

ఆరెంజ్ జోన్లలో కొన్ని షరతులతో కార్యకలాపాలకు అనుమతిచ్చింది. ఇక రెడ్ జోన్లు, కంటైనర్ జోన్లలో ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయనుంది. వీటితో కరోనా బఫర్ జోన్లను గుర్తించి తదనుగుణంగా చర్యలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల నిషేధించేంది. అలాగే విమానాలు, రైళ్ల రాకపోకలపై నిషేధం విధించింది. జనసంచారం ఉండే విద్యాసంస్థలు, బస్సు సర్వీసులు, విద్యాసంస్థలకు లాక్డౌన్ నిబంధనలు అమలు కానున్నాయి. కాగా మే7వరకు తెలంగాణలో లాక్డౌన్ అమలవుతోంది. తాజాగా కేంద్రం మే 17వరకు లాక్డౌన్ పొడగించింది.

ఉద్ధవ్‌ థాక్రే ఎమ్యెల్సీగా ఎన్నికకు మార్గం సుగమం

అయితే లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాని మోదీ రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి మరోసారి ప్రసగించనున్నారు. లాక్డౌన్ అమలుపై తన ప్రసంగంలో ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రీన్ జోన్లో కార్యాకలాపాలకు అనుమతినిస్తూ కొన్ని జోన్లలో సడలింపులు కల్పిస్తే కేంద్రం బహుముఖ వ్యూహంతో ముందుకెళుతున్నట్లు అర్థం అవుతోంది.