జగన్ శత్రువులను పెంచుకుంటున్నారా?

మనం ఎదిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారంటారు. అసూయ, పోటీతో కూడా శత్రువులు తయారవుతారు. ఒకరిని దాటుకుని ముందుకు సాగే క్రమంలో శత్రువులు పుట్టుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు మొదట్లో సోనియాగాంధీ, చంద్రబాబు ఇద్దరే శత్రువులు ఉండేవారు. కాలక్రమంలో వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ మధ్య ఆయనతో చేతులు కలిపిన వారు, ఆశలు పెట్టుకున్న వారు ఇప్పుడు అవి నెరవేరకపోవడంతో శత్రువులుగా మారిపోతున్నారు. జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో మూడేళ్లు ఉంది. […]

Written By: Srinivas, Updated On : June 13, 2021 10:29 am
Follow us on

మనం ఎదిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారంటారు. అసూయ, పోటీతో కూడా శత్రువులు తయారవుతారు. ఒకరిని దాటుకుని ముందుకు సాగే క్రమంలో శత్రువులు పుట్టుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు మొదట్లో సోనియాగాంధీ, చంద్రబాబు ఇద్దరే శత్రువులు ఉండేవారు. కాలక్రమంలో వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ మధ్య ఆయనతో చేతులు కలిపిన వారు, ఆశలు పెట్టుకున్న వారు ఇప్పుడు అవి నెరవేరకపోవడంతో శత్రువులుగా మారిపోతున్నారు.

జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. మరో మూడేళ్లు ఉంది. కానీ చివరి సంవత్సరం తీసేస్తే మిగిలేది రెండేళ్లే. దీంతో ఏం చేయాలన్నా ఈ సమయంలోనే చేయాల్సి ఉంటుంది. ఇక జగన్ మీద అందరి చూపు ఉంటుంది. ఆయన ఇచ్చిన హామీల అమలుకు ఏరకమైన చర్యలు తీసుకుంటున్నారనే దాని గురించే ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లు సమయం ఇచ్చిన వారే ఇక పోరాటానికి రెడీ అయిపోతారు. ప్రభుత్వంలో కీలకమైన భాగంగా ఉన్న ఉద్యోగ వర్గాల్లో జగన్ మీద వ్యతిరేకత ఎక్కువవుతోంది.

ఉద్యోగులు జగన్ మీద కోపం పెంచుకోవడానికి కారణం పీఆర్సీ. తెలంగాణలో అమలయింది ఏపీలో మాత్రం పెండింగులో ఉంది. తాజా బడ్జెట్లో కూడా ఆ ఊసు లేదు. దీంతో వారు మండుతున్నారు. పాదయాత్ర వేళ పెన్షన్ స్కీం విషయంలో పాత విధానాన్నికొనసాగిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా అది నెరవేరలేదు. ఇక మూడు రాజధానుల విషయంలో కూడా ఉద్యోగులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు తాము ప్రభుత్వానికి మద్దతు అనిపైకి చెబుతున్నా లోపల సీన్ మాత్రం వేరేగా ఉందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సమస్య జటిలమవుతోంది. దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు అనబడే పెద్ద సెక్షన్ కూడా సర్కారుకు వ్యతిరేకత ఉంది. నిరుద్యోగ యువత సైతం జగన్ సర్కారు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏదీ అని నిలదీస్తున్నారు. అరకొర ఉద్యోగంగా ఉన్న సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న వారు కూడా బండ చాకిరి తమ మీద పడిపోతుంది అంటూ జగన్ మీద కోపం పెంచుకుంటున్నారు. ధరలు నింగిని అంటుతున్నాయి. దీంతో జగన్ మీద వ్యతిరేకత ఎక్కువగా పెరుగుతోంది.