హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది రెండు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్లబ్ లోని రెండవ అంతస్తులోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి […]
హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్ లో అగ్నిప్రమాదం జరిగింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సిబ్బంది రెండు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్లబ్ లోని రెండవ అంతస్తులోని ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.