ఖైరతాబాద్ గణేశుడుకి.. కరోనా పూజలు..

దేశంలో కరోనా మహమ్మరి కోరలు చాస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తుంది. లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ కరోనా పంజా విసురుతోంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం తెలంగాణలో సామూహికంగా నిర్వహించే పండుగలకు బ్రేక్ వేస్తూ వస్తోంది. ప్రస్తుత కరోనా నిబంధనలతో దేవుడిని […]

Written By: Neelambaram, Updated On : July 2, 2020 4:04 pm
Follow us on


దేశంలో కరోనా మహమ్మరి కోరలు చాస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తుంది. లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ కరోనా పంజా విసురుతోంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం తెలంగాణలో సామూహికంగా నిర్వహించే పండుగలకు బ్రేక్ వేస్తూ వస్తోంది. ప్రస్తుత కరోనా నిబంధనలతో దేవుడిని పూజించే తీరు కూడా మారిపోతుడటం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ లో నో-లాక్‌డౌన్.. కారణాలివే?

తెలంగాణలో ప్రతీయేటా ఉగాది, శ్రీరామనవమి, బోనాల పండుగ, బతుకమ్మ, దసరా, రంజాన్, క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తోంది. అయితే ఏడాది కారణంగా తెలంగాణలో పండుగలన్నీ కళతప్పిపోతున్నాయి. ఇప్పటికే ఉగాది, శ్రీరామనవమి, బోనాలు పండుగలు కళతప్పిపోయాయి. భాగ్యనగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల వేడుకలను సైతం ప్రభుత్వం నిరాడబరంగా నిర్వహించనున్నట్లు ప్రకటింది. ఈసారి మహిళలంతా ఇళ్లలోనే బోనాలు చేసుకోవాలని సూచించింది. ఈసారి పూజారులే అమ్మవారికి బోనాల నిర్వహిస్తారని ప్రకటించింది.

తాజాగా కరోనా ఎఫెక్ట్ గణేశ్ ఉత్సవాలపై పడింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలా? లేదా అనేది ప్రభుత్వం తేల్చుకోలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో ఖైరాతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీయేటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయకుడి ఉత్సవాలను నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే ఖైరాతాబాద్ వినాయకుడి ఉత్సవాలను నిర్వహించేందుకు కమిటీ సన్నహాలను చేస్తోంది.

కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ వ్యూహమేంటి?

ప్రభుత్వం అమలు చేస్తున్న కరోనా నిబంధనల మేరకు ఖైరాతాబాద్ గణేషుడికి పూజలు చేసేందుకు ఉత్సవ కమిటీ సిద్ధమవుతోంది. ఈమేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది 27ఏడుగుల మట్టివిగ్రహాన్ని ప్రతిష్టించి కరోనా నిబంధనలు పాటిస్తూనే భక్తులకు దర్శనం కల్పించేలా కమిటీ నిర్వహాలు పనులు చేపడుతోన్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఖైరాతాబాద్ గణేషుడు ‘ధన్వంతరి వినాయకుడి’ రూపంలో భక్తులకు దర్శమివ్వనున్నాడు.

కరోనా నిబంధనలు పాటిస్తూనే ‘ధ్వనంతరి’ వినాయకుడిని తయారు చేసేందుకు కళాకారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా మట్టిని తెప్పించి పనులను షూరు చేయనున్నారు. 30మంది కళాకారులకు కరోనా టెస్టులను నిర్వహించిన అనంతరం వినాయకుడి విగ్రహ పనులు చేపట్టబోతున్నారు షిప్టులుగా రాత్రిబవళ్లు పనులు చేయనున్నారు. ప్రజలు కరోనా బారి నుంచి బయటపడాలనే సంకల్పంతో ‘ధన్వంతరి వినాయకుడి’ని ప్రతిష్టించనున్నట్లు ఖైరాతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో భక్తులకు ఖైరాతాబాద్ గణేశుడు ఆన్ లైన్లో దర్శనిమవ్వబోతున్నాడు. అలాగే స్థానిక భక్తులంతా ఆరుడుగుల దూరాన్ని పాటిస్తూ పూజలో పాల్గొనేలా నిర్వాహాకులు ఏర్పాటు చేపడుతున్నారు. గణేష్ ఉత్సవాలతో హైదరాబాద్లో కొంతమేర పండుగ వస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కరోనా విఘ్నం నుంచి ఆ విఘ్నేశ్వరుడు బయటపడినట్లుగా ప్రజలంతా బయటపడాలని భక్తులు కోరుకుంటున్నారు. ఈ ఉత్సవాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!