https://oktelugu.com/

కర్ణాటక రాజకీయంలో బూతు పురాణం

కర్ణాటకలో రాజకీయం రసకందాయంలో పడింది. ప్రభుత్వంపై అధికార, విపక్షాలు వ్యూహ, ప్రతి వ్యూహలతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకకు చెందిన మంత్రి,బీజేపీ ముఖ్యనేత రమేష్‌ జర్కిహోళి రాసలీలల వీడియో లీక్‌ అయింది. ఇది ఇప్పటికే రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ప్రజాప్రతినిధిగా ప్రజలకు అండగా ఉండాల్సిన మంత్రి ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో బయటకు రావడంతో సంచలనమైంది. ఇప్పటికే ఓ వైపు బీజేపీ ముఖ్య నేత రమేష్‌ జర్కిహోళిపై వీడియోల వివాదం నడుస్తుండగానే.. మరోవైపు ప్రత్యర్థులపై తన […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 29, 2021 / 12:41 PM IST
    Follow us on

    కర్ణాటకలో రాజకీయం రసకందాయంలో పడింది. ప్రభుత్వంపై అధికార, విపక్షాలు వ్యూహ, ప్రతి వ్యూహలతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకకు చెందిన మంత్రి,బీజేపీ ముఖ్యనేత రమేష్‌ జర్కిహోళి రాసలీలల వీడియో లీక్‌ అయింది. ఇది ఇప్పటికే రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ప్రజాప్రతినిధిగా ప్రజలకు అండగా ఉండాల్సిన మంత్రి ఓ యువతితో చనువుగా ఉన్న వీడియో బయటకు రావడంతో సంచలనమైంది.

    ఇప్పటికే ఓ వైపు బీజేపీ ముఖ్య నేత రమేష్‌ జర్కిహోళిపై వీడియోల వివాదం నడుస్తుండగానే.. మరోవైపు ప్రత్యర్థులపై తన స్టైల్‌లో మాటల దాడి కొనసాగిస్తున్నారు రమేష్‌ జర్కిహోళి. త‌న‌ను ట్రాప్ లో ఇరికించార‌ని ఈ క‌మ‌లం పార్టీ నేత వాపోతున్నాడు. అందుకు కార‌ణంగా కాంగ్రెస్ నేత డీకే శివ‌కుమార్ పేరును పేర్కొంటున్నాడు.

    ఈ క్రమంలోనే డీకే శివ‌కుమార్‌‌ను తీవ్రంగా నిందించాడు ర‌మేష్ జ‌ర్కిహోళి. స‌హ‌నం కోల్పోయి ప‌చ్చిబూతులు మాట్లాడారు. డీకేశిని హిజ్రా అని నిందించాడు. డీకే శివ‌కుమార్ హిజ్రా అని, అందుకే త‌న‌ను ఈ త‌ర‌హా స్కామ్‌లో ఇరికించాడంని అంటూ జ‌ర్కిహోళి ధ్వజ‌మెత్తారు. మ‌గాడైతే త‌న‌ను డైరెక్టుగా ఎదుర్కొనాల‌ని, కొజ్జావాడు కాబ‌ట్టే ఇలా సీడీల స్కామ్ కు పాల్పడ్డాడ‌ని జ‌ర్కిహోళి విమ‌ర్శించారు.

    కాగా.. ఈ విష‌యంపై డీకేశి స్పందించారు. ర‌మేష్ చాలా ఫ్రష్ట్రేష‌న్ లో ఉన్నార‌ని, అందుకే అలా స్పందిస్తున్నారంటూ ప్రతి విమ‌ర్శలు చేశారు. మొత్తానికి క‌ర్ణాట‌క‌లో ఈ బూతు పురాణం రోజురోజుకూ ముదురుతున్నట్లే కనిపిస్తోంది.