వైసీపీ నగరి ఎమ్మెల్యే, ప్రముఖ నటి అయిన రోజా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రోజా నగరి నియోజకవర్గంలోనే ఉండి వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో నగరి, పుత్తూరు నియోజకవర్గాల్లో వైసీపీని దగ్గరుండి ప్రచారం చేసి గెలిపించారు. ఈ క్రమంలోనే ఆమె ఎప్పటినుంచో బాధపడుతున్న సమస్యలు తీవ్రమయ్యాయట..
ప్రస్తుతం తిరుపతి ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న రోజా సడెన్ గా అస్వస్థతకు గురికావడంతో తాజాగా సీఎం జగన్ తోపాటు ఇన్ చార్జి మంత్రి మేకపాటిని అడిగి చెన్నై వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే రోజాకు చెన్నై అపోలో ఆస్పత్రిలో రెండు సర్జరీలు చేశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగినట్లు భర్త సెల్వమణి ప్రకటించారు. ఈ మేరకు ఒక ఆడియోను రిలీజ్ చేశారు రోజా కోలుకుంటున్నారని.. ఐసీయూ నుంచి సోమవారం ఉదయం వార్డుకు తరలించారని చెప్పారు.
మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారని.. ఆమె ఆరోగ్యంపై అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. బాగానే ఉందని తెలిపారు.
ఇక రోజా పాల్గొనే జబర్ధస్త్ ప్రోగ్రాంకు కూడా తాజాగా ఆమె స్థానంలో ఇంద్రజ హాజరయ్యారు. జడ్జిగా హల్ చల్ చేశారు. దీంతో రోజా అస్వస్థతకు గురైన విషయం కన్ఫం అయ్యింది.