ఎల్‌జి కాలుష్యంపై గత ఏడాదే వారించిన కొరియా!

విశాఖలో అత్యంత ప్రమాదకరమైన విష వాయువును వదిలి 12 మంది మరణంతో పాటు వందలాదిమంది అస్వస్థులు కావడానికి దైర్ట్స్తినా ఎల్‌జి పాలిమర్స్‌పై వారి దేశానికి చెందిన దక్షిణ కొరియా ప్రభుత్వమే గత ఏడాదే హెచ్చరించినట్లు తెలుస్తున్నది. అయినా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొనక పోవడం విస్మయం కలిగిస్తుంది. ఏపీలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి ఎర్ర తివాసీ పరచి, పర్యావరణ నిబంధనలు అన్నింటిని గాలికి వదిలి వేసేందుకు సహకరించడానికి ముందుగానే కొరియా […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 12:23 pm
Follow us on

విశాఖలో అత్యంత ప్రమాదకరమైన విష వాయువును వదిలి 12 మంది మరణంతో పాటు వందలాదిమంది అస్వస్థులు కావడానికి దైర్ట్స్తినా ఎల్‌జి పాలిమర్స్‌పై వారి దేశానికి చెందిన దక్షిణ కొరియా ప్రభుత్వమే గత ఏడాదే హెచ్చరించినట్లు తెలుస్తున్నది.

అయినా మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొనక పోవడం విస్మయం కలిగిస్తుంది. ఏపీలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వారికి ఎర్ర తివాసీ పరచి, పర్యావరణ నిబంధనలు అన్నింటిని గాలికి వదిలి వేసేందుకు సహకరించడానికి ముందుగానే కొరియా ప్రభుత్వం హెచ్చరించడం గమనార్హం.

2019 ఏప్రిల్‌లో ఎల్‌జి పాలిమర్స్‌పై దక్షిణ కొరియా ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేస్తూ కాలుష్య నియంత్రణకు సంబంధించిన నియమాలన్నింటినీ ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. 15 రెట్లకు మించిన మోతాదులో క్యాన్సర్‌ వ్యాధికి దారి తీయగల ‘వినైల్‌ క్లోరైడ్‌ రసాయనాన్ని’ గాలిలో వదులుతుందని హెచ్చరించింది.

అంతేకాదు, ఆ కంపెనీ యాజమాన్యంకు వాయు కాలుష్యానికి సంబంధించిన రికార్డులను తారుమారు చేసే చరిత్ర ఉందని ఆ ప్రభుత్వమే గత ఏడాది బయటపెట్టింది. అంటే ఘటన జరిగిన మే 7న కూడా 15 కిలోమీటర్ల మేర విషవాయువును ప్రజలు పీల్చి ఉంటారని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1989 పర్యావరణ నియమాల ప్రకారం స్టైరీన్‌ ఒక విషపూరిత రసాయనం. ఇలాంటివి పరిశ్రమల్లో నిల్వ ఉంచినప్పుడు యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలను తీసుకోవలసి ఉంది. తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) వెల్లడించిన దాని ప్రకారం స్టైరీన్‌ వల్ల క్యాన్సర్‌ వ్యాధి సోకే అవకాశాలున్నాని అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధనా సంస్థ వెల్లడించినట్లు స్పష్టం అవుతుంది.

కేవలం ఇప్పుడు గాయపడిన వారిని, ఆ కంపెనీ పరిసరాలలో ఉన్న వారిని మాత్రమే కాకుండా 10 నుండి 15 కిమీ వరకు ఈ రసాయనాన్ని పీల్చిన ప్రజల అందరి పరిస్థితులపై ఇప్పుడు దీర్ఘకాలిక అధ్యయనం చేపట్టవలసి ఉన్నదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని ఈ ప్రమాదంపై తీవ్రంగా స్పందించవలసి ఉంది