Homeఅంతర్జాతీయంఅయోధ్య తీర్పుపై పాకిస్తాన్‌ కుట్ర!

అయోధ్య తీర్పుపై పాకిస్తాన్‌ కుట్ర!

 

నిన్న (2019, నవంబర్ 09) భారతదేశ చరిత్రలో మరిచిపోలేని రోజు. ఎన్నో ఏళ్ల నుంచి తెగని రామ జన్మభూమి సమస్య సుప్రీం కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. దేశంలో అన్ని పార్టీ నేతలు, అన్ని వర్గాల వారు స్వాగతిస్తూ, శాంతి యుతంగా ఉంటూ తీర్పును గౌరవిస్తూ ఉండగా.. విద్వేషపూరిత వాతావరణం వ్యాప్తిం చేసేందుకే పాకిస్తాన్‌ కుట్ర చేసింది. తీర్పు పట్ల పాకిస్తాన్‌ స్పందనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌ స్పందన అవాంఛనీయం, అసందర్భమని తోసిపుచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని విద్వేషపూరిత వాతావరణం వ్యాప్తిం చేసేందుకే పాకిస్తాన్‌ ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.

 

భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాక్‌ వ్యాఖ్యానించిన తీరు దురుద్దేశపూరితంగా ఉందని, అసందర్భంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ సంతోషకర సమయాన సున్నితత్వం లేని వైఖరి చూపడం పట్ల విచారం వెలిబుచ్చుతున్నట్టు పేర్కొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కు అప్పగిస్తూ మసీదుకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు శనివారం చారిత్రక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version