Pawan Kalyan- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ప్రజలకు ఏదో మంచి చేయాలన్నతలంపు ఎప్పటి నుంచో ఉంది. అటు సినిమాల్లో నటిస్తూనే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంకు స్థాపించి లక్షలాది మందికి వైద్యపరంగా సేవలందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ హీరోచేపట్టని విధంగా సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. అటు విపత్తుల సమయంలో కూడా భారీగా విరాళాలు అందించి తన సేవా నిరతిని చాటుకున్నారు. సినిమా రంగంలో ఉండి ఇంత మందికి సేవ చేస్తుండడం మహత్ భాగ్యంగా భావించేవారు. అదే రాజకీయంగా అడుగులేస్తే రాష్ట్ర ప్రజలకు సేవ చేయవచ్చని భావించారు. అందుకే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే తాను ఊహించిది ఒకటి.. ప్రజల తీర్పు మరోలా ఉండడంతో మనస్తాపానికి గురయ్యారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి చారిత్రక తప్పిదం వైపు అడుగులేశారు. పవన్ కళ్యాణ్ జనసేన మాదిరిగా పీఆర్పీని కొనసాగించి ఉంటే వైసీపీ అనే పార్టీ పుట్టుకొచ్చేది కాదు. కానీ నాటి పరిస్థితులు, నాడు వెన్నంటి నడిచిన కొందరు నేతల పుణ్యమా అని విలీన ప్రక్రియ జరిగిపోయింది. అయితే అటు తరువాత చిరంజీవికి రాజ్యసభ, ఆ పై కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. టూరిజం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చిరంజీవి అనేక వినూత్న పథకాలకు శ్రీకారంచుట్టారు. టూరిజం ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి కూడా. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం చవిచూడడంతో చిరంజీవి రాజకీయంగా తెరమరుగయ్యారు. తిరిగి సినిమాల్లో నటించడం ప్రారంభించారు.
అయితే తెలుగునాట చిరంజీవికి ఉన్న చరిష్మా ఏ నటుడికి లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చిరంజీవిని తమ పార్టీ నాయకుడిగానే చూస్తోంది. అటు ప్రధాని మోదీ కూడా చిరంజీవి పట్ల సానుకూలత చూపుతున్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ఎవరికీ లేని ప్రాధాన్యత చిరంజీవికి దక్కింది. అటు రాజకీయంగా సీఎం జగన్ తో పాటు మంత్రులు పవన్ ను ధ్వేషిస్తున్నా.. చిరంజీవి విషయానికి వచ్చేసరికి మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. లక్షలాది మంది అభిమానులు చిరంజీవి సొంతం. అందుకే బీజేపీ ఆహ్వానించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాజకీయ స్ట్రేటజీలో భాగంగా వైసీపీ రాజ్యసభ స్థానం ఆపరిచ్చిందన్న వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ చెక్ చెబుతూ ముందుకు సాగారు. అయితే ఇటీవల తాను రాజకీయాలకు దూరమయ్యేనే తప్ప తన నుంచి రాజకీయాలు దూరం కాలేదని చిరంజీవి గట్టి సంకేతాలే పంపారు. అయితే దీనిపై చర్చోప చర్చలు కొనసాగాయి. కానీ చిరంజీవి దీనిపై స్పందించలేదు. అయితే చిరంజీవి ఆశిస్సులు తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ ఉంటాయని.. గత తప్పిదాలు పునరావృతం కాకుండా మెగా అభిమానులు ఒకేతాటిపైకి వచ్చి జనసేన గెలుపునకు నడుం బిగిస్తారని జన సైనికులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో అన్ని రాజకీయ పక్షాలకు కుటుంబసభ్యల దన్ను ఉంది. జనసేన విషయంలోకి వచ్చేసరికి మాత్రం మెగా బ్రదర్ నాగబాబు ఒక్కరే కనిపిస్తున్నారు. మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన హీరోలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజా ప్రకటన మాత్రం తమ మద్దతు జనసేనకు ఉంటుందని సంకేతాలిచ్చారు. అటు బీజేపీ, ఇటు వైసీపీ రాజ్యసభ ఆఫర్ ఇచ్చినా అది వారి రాజకీయ లబ్ధి కోసమేనని చిరంజీవి గ్రహించారు. అందుకే సున్నితంగా తిరస్కరించారు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో జనసేన నిర్ణయాత్మక శక్తిగా మారి పవన్ సీఎం అయితే మాత్రం చిరంజీవి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశాలు పుష్కలమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పవన్ ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. కానీ జనసేన, బీజేపీల మధ్య అంత సాన్నిహిత్యం మాత్రం లేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ టీడీపీతో కలిసినా.. ఒంటరిగా పోటీచేసినా గౌరవప్రదమైన సంఖ్యలో అసెంబ్లీ సీట్లు కొల్లగొడతారని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అంటే జనసేన లేని ప్రభుత్వం ఏర్పాటుచేయడం కష్టమేనని తెలుస్తోంది. అయితే మోదీకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న నాయకులు ఇదే భావనతో ఉన్నారు. బీజేపీని వదులుకొన్న మరుక్షణం పవన్ ను కూటమిలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో కానీ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తే జాతీయ స్థాయిలో కూడా జనసేన చక్రం తిప్పే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఒక్క చిరంజీవి తప్ప.. ఆయన అభిమాన సంఘాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో నాగబాబు ఉన్నారు. అయితే భౌతికంగా చిరంజీవి పార్టీలో చేరకపోయినా.. ఆయన మాత్రం జనసేన అధికారంలోకి రావాలని విశ్వసిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు ఐదు వేల మంది జనసేనలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. గతంలో చిరంజీవి అభిమాన సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారు స్థానిక రాజకీయాల పరంగా గత ఎన్నికల్లో వైసీపీకి సపోర్టు చేశారు. అటువంటి వారంతా రీ బ్యాక్ అవుతున్నారు. ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎంగా పవన్ ను, కేంద్ర మంత్రిగా చిరంజీవినిచూడాలని మాత్రం అటు మెగా, పవర్ స్టార్ అభిమానులు, జన సైనికులు, కాపు సామాజికవర్గం ఉవ్విళ్లూరుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: If pawan kalyan is cm then chiranjeevi will be given that post
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com