Homeహాలీవుడ్Jon Landau: బ్రేకింగ్: టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత కన్నుమూత... విషయం ఆలస్యంగా వెలుగులోకి, మరణానికి...

Jon Landau: బ్రేకింగ్: టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత కన్నుమూత… విషయం ఆలస్యంగా వెలుగులోకి, మరణానికి కారణం?

Jon Landau: టైటానిక్, అవతార్ వంటి ఆల్ టైం క్లాసిక్స్ నిర్మించిన నిర్మాత జోన్ లాండౌ కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోన్ లాండౌ నిర్మించింది కొద్ది చిత్రాలే అయినా ప్రపంచ సినిమా పై చెరగని ముద్ర వేశారు. జోన్ లాండౌ 1987లో క్యాంపస్ మాన్ టైటిల్ తో ఒక చిత్రం నిర్మించారు. ఆ మూవీ విడుదలైన పదేళ్లకు టైటానిక్ చిత్రాన్ని ఆయన నిర్మించారు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన టైటానిక్ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం అది.

వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన టైటానిక్ ఆల్ టైం క్లాసిక్. ఈ మూవీ ఏకంగా రూ. 18 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పలు విభాగాలలో నామినేట్ అయిన టైటానిక్ ఏకంగా 11 ఆస్కార్స్ కొల్లగొట్టింది. 12 ఏళ్ల పాటు టైటానిక్ వసూళ్లను బీట్ చేసే చిత్రం రాలేదు. జేమ్స్ కామెరూన్ తన రికార్డ్ తానే అవతార్ మూవీతో బ్రేక్ చేశాడు.

అవతార్ చిత్రాన్ని కూడా జోన్ లాండౌ నిర్మించడం విశేషం. 2009లో విడుదలైన అవతార్ వరల్డ్ వైడ్ రూ. 24 వేల కోట్ల వసూళ్లు రాబట్టింది. జేమ్స్ కామెరూన్-జోన్ లాండౌ ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లారు. అవతార్ సైతం 9 విభాగాల్లో నామినేట్ అయ్యింది . 3 అవార్డులు గెలుచుకుంది. అవతార్ సీక్వెల్ అవతార్ 2 కి కూడా బాగానే ఆదరణ దక్కింది. రూ. 19 వేల కోట్ల వసూళ్లు అందుకుంది.

అవతార్ సిరీస్లో మరో మూడు భాగాలు రానున్నాయి. వాటిని పూర్తి చేయకుండానే జోన్ లాండౌ మరణించారు. జోన్ లాండౌ జులై 5వ తేదీనే మరణించినట్లు సమాచారం. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులు ఆలస్యంగా తెలియజేశారు. జోన్ లాండౌ ప్రస్తుత వయసు 63 సంవత్సరాలు. జోన్ లాండౌ మరణానికి కారణాలు తెలియరాలేదు. ఆయన మృతి వార్త తెలిసిన అభిమానులు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular