Heavy Rains in Telangana: రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వానతో ప్రజలు అల్లాడిపోతున్నారు వాగులు, వంకలు, చెరువులు నిండిపోతున్నాయి. ఫలితంగా రోజులపాటు వర్షాలు కురవడంతో ప్రాజెక్టులన్ని నిండిపోయాయి. నీటివనరులన్ని కళకళలాడుతున్నాయి. పంటలు నీట మునిగాయి. పాత ఇళ్లు నేలమట్టం అవుతున్నాయి. రోడ్లు ధ్వంసమవుతున్నాయి. భారీ వర్షాలు పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్ని రోజులు ఉత్తర తెలంగాణలో దంచి కొడితే ఇప్పుడు దక్షిణ తెలంగాణను వణికిస్తున్నాయి.
పాత ఇళ్ల గోడలు కూలి నలుగురు మరణించారు. జాతీయ రహదారిపై వరద నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. భద్రాచలం వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో వర్షాల ధాటికి నష్టం తీవ్రంగానే జరిగింది. కానీ ఇంతవరకు అధికారులెవరు కూడా పంట నష్టంపై ఎలాంటి విచారణ చేపట్టడం లేదు. రైతులకు భరోసా కల్పించడం లేదు. ఫలితంగా పంటలు ధ్వంసమైనా వారికి కన్నీరే మిగులుతోంది. ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. దీంతో రైతులకు సమస్యలు తప్పడం లేదు.
Also Read: Minister KTR: బయట మంత్రిని.. ఇంట్లో తండ్రిని.. బర్త్డే వేళ కేటీఆర్ కామెంట్స్ వైరల్
మెదక్ జిల్లా పాతూరులో అత్యధికంగా 26 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, జనగామలో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. దీంతో పంటలు నీట మునిగాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. రహదారులపై నీరు నిలుస్తోంది. రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. నష్ట నివారణపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలోకి నీరు చేరింది. హల్దీ, కూడవెళ్లి, నల్లవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా నర్సింహులపేట మండలం రాంపురం మధ్యలో బొత్తలపాలెం వద్ద పాలేరు వాగులో చిక్కుకున్న 22 మంది కూలీలను రెవెన్యూ, ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గిరిజన సంక్షేమ శాఖ మినీ గురుకులంలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. భద్రాచలం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read:Rupee Falling: రూపాయి విలువ పడిపోతే మనకేమవుతుంది..?
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Heavy rains in telangana people are suffering
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com