Homeలైఫ్ స్టైల్How blood determines health: మీ రక్తమే..మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది..

How blood determines health: మీ రక్తమే..మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది..

How blood determines health: రక్తాన్ని ద్రవరూపకణజాలం అంటుంటారు. ఇందులో అనేక రకాలైన పదార్థాలు ఇమిడి ఉంటాయి. వాస్తవానికి మనకు తెలిసినంతవరకు రక్తంలో ఎరుపు, తెలుపు రక్త కణాలు ఉంటాయని.. రక్తఫలకికలు రక్తం గడ్డ కట్టడంలో తోడ్పడతాయని చదువుకున్నాం కదా. అయితే రక్తానికి.. మూత్రపిండాలకు బలమైన సంబంధం ఉంటుంది. మధ్యలో కాంపోనెంట్లు అనేది వారదులుగా పనిచేస్తుంటాయి.

రక్తంలో ప్లాస్మా ఉంటుంది. ఇందులో లవణాలు.. ప్రోటీన్లు.. ఇమ్యునో గ్లోబ్యులీన్ లు 55% వరకు ఉంటాయి. అంతేకాదు మనిషి ప్రాణాలను రక్షించే వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించిన కణాలు కూడా ఉంటాయి. 90 శాతం వరకు నీరు ఉంటుంది. ఇందులో లవణాలు, హార్మోన్లు, ప్రోటీన్లు, బై కార్బోనేట్ ఆయాన్లు 8 శాతం వరకు ఉంటాయి. మెదడు నుంచి వివిధ శరీర అవయవాలకు వచ్చే ఆదేశాలను ఈ ఆయాన్లు చేరవేర్చుతూ ఉంటాయి. హార్మోన్లు అత్యంత కీలకమైన జీవ క్రియలను నిర్వహిస్తూ ఉంటాయి. బై కార్బోనేట్ ఆయాన్లు వివిధ రకాలైన ఆమ్ల, క్షారపదార్థాలను వేరు చేస్తాయి.

రక్తమనేది ఆహారం జీర్ణమైన తర్వాత.. అది గ్లూకోజ్ మాదిరిగా రూపాంతరం చెందిన తర్వాత.. అన్ని కణాలకు అందించేందుకు తోడ్పడుతుంది. గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫాటీ యాసిడ్స్ ను అన్ని కణాలకు అందిస్తుంది.

రక్తంలో ఉన్న గ్లూకోజ్ వల్ల శరీరంలో అన్ని జీవ క్రియలు జరుగుతాయి. దీనిని మెటబాలిజం అని పిలుస్తూ ఉంటారు. కార్బన్డయాక్సైడ్, యూరియా, లాక్టిక్ యాసిడ్ వంటి కొన్ని కాలుష్యాలు, ఇతర వ్యర్ధాలు మెటబాలిజంలో ఉత్పత్తి అవుతుంటాయి. వీటిని శుభ్రం చేయడానికి మూత్రపిండాలు సహకరిస్తుంటా. అయితే ఈ వ్యర్ధాలను మూత్రపిండాలకు రక్తం చేరవేర్చుతూ ఉంటుంది. రక్తంలో ఉన్న తెల్ల రక్త కణాలు బయట మంచి వచ్చే క్రిములతో పోరాడుతాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

మన దేహంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు , రక్త ఫలకికలు ఉంటాయి. ఇవన్నీ వేర్వేరు కాంపోనెంట్ల మాదిరిగా విధులు నిర్వర్తిస్తుంటాయి. రక్త స్రావం జరుగుతున్నప్పుడు రక్త ఫలకికలు గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయి.. ఇవి ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ కు 1,50,000 నుంచి 4,00,000 వరకు ఉంటాయి. వీటి సంఖ్య తగ్గితే అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.

పురుషులలో ఎంఎం క్యూబ్.. రక్తానికి 4.3 నుంచి 5. 9 మిలియన్ ఎర్ర రక్త కణాలు ఉండాలి. మహిళల్లో 3.5 నుంచి 5.5 మిలియన్ ఎర్ర రక్తకణాలు ఉండాలి. హిమోగ్లోబిన్ పురుషుల్లో ప్రతి డేసి లీడర్ కు 13.5 నుంచి 17.5 గ్రాములు, మహిళల్లో 12.0 నుంచి 16.0 గ్రాములు ఉండాలి. హిమోగ్లోబిన్ వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది.

తెల్ల రక్త కణాలు ప్రతి క్యూబిక్ మిల్లీమీటర్ కు 4500 నుంచి 11 వేల వరకు ఉండాలి..

ఇందులో ఉన్న న్యూట్రోల్స్ శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి రక్షిస్తాయి.

లింపో సైట్స్ వైరస్ ల నుంచి.. క్యాన్సర్ కణాల నుంచి శరీరాన్ని కాపాడుతాయి.

మోనో సైట్స్ చెడిపోయిన కణాలను నిర్మూలించి.. ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవుల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

ఇసినోఫిల్స్ శరీరాన్ని పరాన్న జీవుల నుంచి.. సూక్ష్మ క్రిముల నుంచి కాపాడతాయి.

బేసో పిల్స్ శరీరాన్ని అలర్జీల నుంచి కాపాడతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Oktelugu Epaper
Exit mobile version