Husband And Wife Relationship: భార్య భర్తల జీవితం ఎంతో పవిత్రమైనది. కానీ కొందరు ఈ జీవితాన్ని తమ ఇగోలతో చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి ఓ తోడు అవసరం. ఆ తోడు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. కాజీ జీవితాంతం కలిసుండేది భార్యకు భర్త తోడు.. భర్తకు భార్య తోడు మాత్రమే. ఒకరినొకరు అర్థం చేసుకునే భార్యభర్తల జీవితాలు సుఖ సంతోషాలతో సాగుతాయి. అయితే పురుషుడు తనకు కావాల్సిన భార్య ఎలా ఉండాలో నిర్ణయించుకోలేడు. ఎందుకంటే అనుకున్నవన్నీ తన సతీమణిలో ఉండకపోవచ్చు. కానీ కొన్ని ప్రధాన లక్షణాలు తన జీవిత భాగస్వామిలో ఉంటే మాత్రం అతని జీవితం ధన్యమైనట్లే. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..
హైందవ ధర్మంలో భార్యను అర్ధాంగి అంటారు. అంటే భార్య భర్తలో సగం అన్నమాట. అలాంటి భార్య ఎలా ఉండాలో గరుడ పురణంలో కూడా చెప్పారట. గరుడ పురాణంలోని రాసిన ఈ గుణాలు గనుక తన భార్యలో ఉంటే ప్రపంచంలో అందరికంటే అతడే అదృష్టవంతుడట. మంచి మాటలు పలికే భార్య దొరకడం అదృష్టం. ఎప్పుడు సున్నితంగా మాట్లాడుతూ ఇతరులతో కలివిడిగా ఉండడంతో భర్తకు సంతోషాన్నిస్తుంది. అలాగే భార్యతో ప్రియంగా మాట్లాడడం వల్ల భార్య చెప్పిన ప్రతీ మాట ఆ భర్త వినే అవకాశం ఉంది. ఇలా మాట్లాడడం వల్ల ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమె పట్ల ప్రేమగా మెదులుతారు. ఈమె వల్ల జీవితాంతం సంతోషంగా ఉంటారు.
భర్త చెప్పే ప్రతీ మాట వినే భార్య కొందరికే దక్కుతుంది. . ఏ భార్య అయితే భర్తే సర్వస్వం అనుకుంటుందో ఆ భార్య తన భర్తమాటే వింటుంది. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకించదు. ఇటువంటి భార్య ఉన్న భర్త అత్యంత అదృష్టవంతుడు.ధర్మగ్రంధాలానుసారం ఈ లక్షణాలున్న భార్యతను పతివ్రత అంటారు. ఒక ఆదర్శ భార్య ఆలోచన ఎప్పుడూ తన భర్త, తన కుటుంబం బాగోగుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారి ఉన్నతి , వారి ఆనందమే కోరుకుంటుంది. ఇటువంటి లక్షణాలు మీ భార్యగా రావాలని కోరుకోండి. లేదా ఉన్నవారిలో ఈ లక్షణాలు ఉన్నాయో.. లేవో తెలుసుకోండి..