Rashmika Mandanna: సాధారణంగా ఒక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటే…. రీల్ లో ఎంత ప్రేమిస్తారో రియల్ గా కూడా అంతే ప్రేమిస్తారు మన తెలుగు ప్రేక్షకులు. అంతేకాదు కొన్నిసార్లు మరీ ముందుకు వెళ్లి ఆ జంట బయట పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుందో అని ముచ్చటించుకుంటారు. ఇక వారి నిజంగా ప్రేమించుకుంటున్నారు అనే ఒక చిన్న క్లూ బయటకు వచ్చిన.. ప్రేక్షకులు దాన్ని పెద్దగానే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారు. ఇక ఇలాంటి హీరో హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన జంట రష్మిక మందాన, విజయ దేవరకొండ.
గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ లో కనిపించిన ఈ జంట.. గీతా గోవిందం నుంచే ప్రేమలో ఉన్నారు అనే వార్త అప్పట్లో చక్కర్లు కొట్టింది. ఇక ఆ వార్త నిజమే అన్నట్టు ఆ మధ్య తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల ద్వారా.. ముంబై ఎయిర్‌పోర్టులో విజయ్, రష్మిక కనిపించడం ద్వారా… అలానే మాల్దీవుల్లో రష్మిక ఇక విజయ్ పిక్స్ ఒకే సమయంలో బయటకు రావడం ద్వారా.. వీరిద్దరూ తప్పక ప్రేమలో ఉన్నారు అని ప్రేక్షకులు నిర్ణయించేశారు. దానికి తగ్గట్టు ఈ జంట చేసే పలు పనులు కూడా అలానే ఉంటాయి. కావాలనే ప్రేక్షకులకు తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ.. వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు చూస్తే.. ఎలాంటి వారి కైనా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని దొరికిపోతారు. ప్రస్తుతం ఇప్పుడు అలానే ఒక సంఘటన చోటు చేసుకుంది.
సాధారణంగా సెలబ్రెటీలను జనాలు ఎప్పుడూ క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. అలానే ఇప్పుడు రష్మిక విషయంలో చేసి.. రష్మిక మందన తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిందంటూ ప్రచారం మొదలుపెట్టారు.
ఇటీవల రష్మిక అసిస్టెంట్ వివాహం హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు పసుపు రంగు చీర కట్టులో దేవకన్యలా వచ్చిన రష్మిక అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ పెళ్లికి వచ్చిన ఈ హీరోయిన్ హైదరాబాద్‌లోని తన బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిందట. ఇది 100% నిజమే అని సోషల్ మీడియా యూజర్స్ బల్లగొట్టి చెబుతున్నారు. అది ఎలాగా అనగా.. రష్మిక ఒక ఫోటో షేర్ చేసింది.. ఇక ఆ ఫోటోలో ఉన్న పిట్టగోడ ఆధారంగా నెటిజన్లు ఈ విషయాన్ని పట్టేశారు.
విజయ్ దిగిన ఒక ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ.. రష్మిక యెల్లో శారీలో దిగిన ఫొటోలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పిట్టగోడ రెండూ సేమ్ టు సేమ్. దీంతో ఇది విజయ్ దేవరకొండ ఇల్లు అని కన్ఫర్మ్ చేసేశారు మన సోషల్ మీడియా యూజర్. వీళ్ల అబ్జర్వేషన్ చూస్తే ఓరి నాయనో అనిపించకమానదు. మొత్తానికి విజయ్ రష్మిక వాళ్ళ ప్రేమను బయటపెట్టే పని కూడా లేకుండా మనవారు ఫిక్స్ అయిపోతున్నారు.