Homeలైఫ్ స్టైల్Best Yoga Poses For Kids: పిల్లల్లో ఏకాగ్రతను పెంచే ప్రత్యేకమైన యోగాసనాలు ఇవే..

Best Yoga Poses For Kids: పిల్లల్లో ఏకాగ్రతను పెంచే ప్రత్యేకమైన యోగాసనాలు ఇవే..

Best Yoga Poses For Kids: ప్రస్తుత కాలంలో పిల్లలు చదువులు, పోటీ పరీక్షలు, డిజిటల్ పరికరాల వినియోగం వల్ల ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక యోగాసనాలు, ధ్యాన పద్ధతులు పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రతను పెంపొందిస్తాయని సూచిస్తున్నారు. ప్రత్యేకంగా పిల్లలు చేయాల్సిన యోగాసాలు ఏవో చూద్దాం..

బాలాసనం:
యోగాలో ముఖ్యమైన భంగిమల్లో బాలాసనం ఒకటి. ఈ ఆసనం చేయడం వల్ల శరీరంలోని కండరాలు రిలాక్స్ అవుతాయి. మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చదువుల ఒత్తిడి, ఆందోళన తగ్గి పిల్లలు ప్రశాంతంగా ఆలోచించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. రోజూ కొన్ని నిమిషాల పాటు బాలాసనం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు.

త్రాటక్ ధ్యానం:
త్రాటక్ ధ్యానం అనేది ఒక వస్తువు లేదా దీప జ్యోతిని కదలకుండా చూడటం ద్వారా చేసే ధ్యాన ప్రక్రియ. ఇది కళ్ల కండరాలను బలపరచడమే కాకుండా మనసును ఒకే అంశంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ఈ సాధన వల్ల పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ మెరుగుపడి చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. అలాగే జ్ఞాపకశక్తి, పరిశీలనా నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల వినియోగం పెరగడంతో చిన్న వయసులోనే పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. త్రాటక్ వంటి యోగ సాధనలు కంటి కండరాలకు వ్యాయామంలా పనిచేస్తాయి. దీంతో కళ్ల అలసట తగ్గి చూపు మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే చిన్నపిల్లలు త్రాటక్ ధ్యానం చేసే సమయంలో పెద్దల పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలు, హోంవర్క్, ఇతర విద్యా కార్యక్రమాల వల్ల పిల్లల్లో ఒత్తిడి పెరగడం సహజం. యోగా, ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల స్థాయులు తగ్గుతాయి. ఫలితంగా పిల్లలు ప్రశాంతంగా ఉండటంతో పాటు భావోద్వేగాలను సులభంగా నియంత్రించగలుగుతారు. ఇది వారి వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడుతుంది.

యోగాను ప్రతిరోజూ ఒకే సమయానికి చేయడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ అలవడుతుంది. శరీరంపై, మనసుపై నియంత్రణ పెరగడంతో ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపడుతుంది. పాఠశాల కార్యకలాపాలు, క్రీడలు, ఇతర ప్రతిభా రంగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడానికి ఇది సహాయపడుతుంది.

నిపుణుల సూచనల ప్రకారం పిల్లలు రోజుకు 15 నుంచి 30 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం వేళల్లో స్వచ్ఛమైన గాలిలో యోగా చేయడం మరింత ప్రయోజనకరం. ప్రారంభంలో సులభమైన ఆసనాలతో మొదలుపెట్టి, క్రమంగా ఇతర యోగాభ్యాసాలను చేర్చడం మంచిదని సూచిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular