Addicted Alcohol: ఈరోజుల్లో పురుషుల కంటే మహిళలలే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. అప్పట్లో కూడా మహిళలు మద్యం తాగేవారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే. అందులోనూ కొన్ని ఫిల్డ్‌లో ఉండే అమ్మాయిలే ఎక్కువగా సేవిస్తారనే భావనలు ఉండేవి. కానీ ఈరోజుల్లో అయితే అధికశాతం అమ్మాయిలే మద్యం సేవిస్తున్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమే. ఈ విషయం తెలిసిన కూడా చాలామంది అమ్మాయిలు తాగుతున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా మద్యం సేవించడానికి గల కారణాలేంటో ఈరోజు తెలుసుకుందాం.
వర్క్ బిజీ, టెన్షన్‌తో పాటు కుటుంబ సమస్యలను తట్టుకోలేక చాలామంది మద్యం తాగుతున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల తాత్కాలికంగా సమస్యల నుంచి ఉపశమపనం పొందుతున్నామనే అనుకుంటారు. కానీ ఎక్కువగా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని మాత్రం భావించరు. ఈమధ్య అయితే మద్యం తాగడం ఒక కల్చర్ అయిపోయింది. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో మహిళలు తాగుతున్నారు. మద్యం తాగని మహిళలో పోలిస్తే.. మందు తాగే మహిళలకు 50 శాతం ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తాజా ఓ అధ్యయనంలో తేలింది.
పురుషుల కంటే మహిళలే రోజూ ఎక్కువ రకాలైన ఆల్కహాల్ సేవిస్తున్నారని తేలింది. ఈ అధ్యయనాన్ని 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు వారిపై అధ్యయనం చేశారు. మద్యం ఎక్కువగా తాగితే గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణలు అంటున్నారు. సాధారణంగా పురుషులు 3 నుంచి 14 పెగ్గులు వారానికి తీసుకుంటారు. ఇది పురుషులకు మితం అని చెప్పవచ్చు. కానీ మహిళలు మాత్రం వారానికి 3 నుంచి 7 పెగ్గులు తీసుకుంటే మితంగా తాగినట్లు. అంతకంటే ఎక్కువగా తాగితే అధికంగా మద్యం తీసుకుంటున్నట్లే. అయితే పురుషులు మితంగానే మద్యం సేవిస్తున్నారు. కానీ మహిళలలో వాళ్ల పరిధికి మించి తాగుతున్నారు.
ఒత్తిడి, వ్యక్తిగత కారణాల వల్ల చిన్న వయస్సులోనే మహిళలు మద్యానికి బానిస అవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిన్నిటి నుంచి విముక్తి కోసం మద్యం సేవిస్తున్నారు. కానీ చివరకు అది ఒక వ్యసనంగా మారుతుంది. ఈ కేటగిరీలో అందరూ మహిళలు ఉండరు. కొందరు మహిళలు మాత్రమే మద్యానికి బానిస అవుతున్నారు. మద్యం సేవించిన తర్వాత కొందరు మహిళలు తన మూడ్‌ను కంట్రోల్‌లో ఉంచుకోలేరు. దీనివల్ల వారు సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఈశాన్య రాష్ట్రాల్లో మద్యం సేవించే మహిళలు ఎక్కువగా ఉంటారు. పురుషులతో సమానంగా ఈ రాష్ట్రాల్లో మద్యం సేవిస్తారు. అయితే పురుషులతో పోలిస్తే మహిళల శారీరక నిర్మాణం వేరేగా ఉంటుంది. మహిళల శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఉండే హార్మోన్లు ఆల్కహాల్‌ను తొందరగా గ్రహించలేవు. దీంతో మహిళల శరీరంలో మెటబాలిజమ్ తగ్గిపోయి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.