Winter season: ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత (Winter) పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి (Winter) ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. దీనికి తోడు ఇంట్లో కూడా చల్లగా ఉండే ఈ సమస్య (Health Issues) పెరుగుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి చెందడానికి చాలా మంది బయటకు వెళ్లకుండా ఉంటారు. ఏదో తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్తుంటారు. ఇలా వెళ్తున్న సమయంలో చల్ల గాలి వల్ల జలుబు (Cold), దగ్గు (Cough) వంటివి వస్తున్నాయి. బాడీలో సరైన ఇమ్యూనిటీ పవర్ లేకపోతే తప్పకుండా ఇలాంటి సమస్యలు వస్తాయి. చలికాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగాలని అంటున్నారు. కుంకుమ పువ్వులోని క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ బి6, థయామిన్, ఫోలేట్, మెగ్నీషియం, కాపర్ ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి కుంకుమ పువ్వు పాలలో కలిపి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
రోగనిరోధక శక్తి పెరుగుదల
వేడి పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల బాడీ వెచ్చగా ఉంటుంది. అలాగే ఒత్తిడి వంటి సమస్యలు తగ్గడంతో పాటు బాడీ కూడా వెచ్చగా తయారవుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా రావు. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పేగు ఆరోగ్యం
కుంకుమపువ్వును పాలలో కలిపి తాగడం వల్ల పేగు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో కొందరికి తిన్న ఫుడ్ జీర్ణం కాక సమస్యలు ఎదుర్కుంటారు. అలాంటి వారు పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగడం వల్ల పేగు సమస్యలు అన్ని క్లియర్ అవుతాయి. అలాగే నిద్ర కూడా బాగా పడుతుంది.
కండరాలు, ఎముకలు దృఢంగా
పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగడం వల్ల కీళ్ల సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే పాలు, కుంకుమ పువ్వు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. కేవలం గర్భిణులు మాత్రమే పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగాలని లేదు. ఆరోగ్యానికి ఎవరైనా కూడా పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో అన్ని సమస్యల నుంచి విముక్తి పొందాలంటే తప్పకుండా పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగండి. ఇలా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.