Kidney Stone Prevention: మనం రోజు తిని ఆహారంలోనే ఆరోగ్యం ఉంటుందని కొందరు వైద్యులు చెబుతుంటారు. అందువల్ల ప్రతిరోజు సరైన ఆహారం.. సక్రమంగా తీసుకోవాలని అంటారు. అయితే ఇలా సరైన ఆహారం తీసుకున్నా.. ఒక్కోసారి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పదార్థాల వల్ల ఈ వ్యాధులు వస్తుండగా.. శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటీవల చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కిడ్నీ స్టోన్స్ స్పెయిన్. ఇవి మగ, ఆడవారిద్దరికీ వస్తున్నాయి. అయితే వీటిపై కొన్ని అపోహలు.. సందేహాలు ఉన్నాయి. వాటి గురించి వివరాల్లోకి వెళితే..
శరీరంలో యూరిక్ ఆసిడ్ వల్ల లేదా నీటి శాతం తగ్గి.. డిహైడ్రేషన్కు గురికావడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. ఈ కిడ్నీ స్టోన్స్ ఫోర్ ఎం ఎం నుంచి 5ఎంఎం వరకు ఉంటాయి. ఇవి 5 ఎం ఎం ఉన్నప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అయితే కొందరికి నడుమునొప్పి వచ్చినప్పుడు కూడా కిడ్నీ స్టోన్ పెయినా అని సందేహం వస్తుంది. వాస్తవానికి కిడ్నీ స్టోన్స్ నొప్పి నడుము పైభాగాన పక్కటెముకల పక్కన ఉంటుంది.. నడుము నొప్పి నడుము కింది భాగంలో ఉంటుంది. నడుమునొప్పి ఒకరోజు ఉండి.. మరో రోజు ఉండకపోవచ్చు. అలాగే కూర్చొని నిలబడే సమయంలో ఇది తగ్గవచ్చు. కానీ కిడ్నీ స్టోన్స్ పెయిన్ మాత్రం ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. అంతేకాకుండా ఇది తీవ్రంగా ఉంటుంది.
కిడ్నీ స్టోన్స్ సైజ్ పెరిగి ఆపరేషన్ చేసుకున్న తర్వాత వైద్యుల సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే తిరిగి మరోసారి స్టోన్స్ తయారయ్యే అవకాశం 50 శాతం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. టమాట ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. పాలు, పెరుగు మితంగా తీసుకోవాలి. అలాగే డిహైడ్రేషన్ కాకుండా నిత్యం వాటర్ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వేసవి కాలంలో చెమట ద్వారా నీరు బయటకు వెళ్తుంది. అందువల్ల ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డిఐటేషన్ కాకుండా ఉంటుంది.
అయితే ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో కల్లు, బీర్లు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయని చెబుతున్నారు. వాస్తవానికి బీర్లు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయని ఏ వైద్యులు చెప్పరు. శాస్త్రీయంగా కూడా ఎక్కడా నిరూపితం కాలేదు. బీర్లు తాగడం వల్ల డిహైడ్రేషన్ కు గురవుతారు. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ కరిగే అవకాశం ఎలాగా ఉండదు. అలాగే కల్లు లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా కిడ్నీలో ఉండే స్టోన్ కరుగుతాయని నిరూపించబడలేదు. కిడ్నీ స్టోన్స్ కరగడానికి సరైన వైద్య చికిత్స తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ అని తెలిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.