Telugu film industry growth: తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలంగాణ ప్రభుత్వం చాలావరకు సపోర్ట్ చేస్తోంది. ముఖ్యంగా కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటికి ప్రీమియర్ షోస్ ఇవ్వడంలో గాని, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుంది… అలాగే ఆ సినిమాలకు వినోదపు పన్ను తగ్గించడంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. అందువల్లే చాలామంది దర్శక నిర్మాతలు సినిమాలను చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ను తెలంగాణ ప్రభుత్వం (TGFDC) ‘తెలంగాణ ఫిలిం డెవలమెంట్ కార్పొరేషన్’ చైర్మెన్ గా నియమించింది…ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు దిల్ రాజుని చైర్మెన్ గా నియమించారు. అయితే ప్రస్తుతం దిల్ రాజు సైతం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే తెలంగాణలో ఎక్కడైనా సరే షూటింగ్ చేసుకోవడానికి లొకేషన్స్ అవలేబుల్ లో ఉండడానికి గాని వాటి పర్మిషన్స్ తీసుకోవడానికి గాని చాలా రోజులపాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది… ఇక దీన్ని సులభతరం చేయడానికి దిల్ రాజు ఒక వెబ్ సైట్ ను అయితే క్రియేట్ చేశాడు. అందులో తెలంగాణలో ఉన్న లొకేషన్స్ అన్నీ ఉంటాయి.
ఎక్కడైతే షూట్ చేయాలనుకుంటున్నారో దానికి పర్మిషన్స్ తీసుకునేవిధంగా ఆ వెబ్ సైట్ ను అయితే క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల ప్రతి ఒక్కరి పని చాలా ఈజీగా అయిపోతుందని అందుకే దిల్ రాజు ఈ వెబ్ సైట్ ను క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ వెబ్సైట్ పనులు మొత్తం పూర్తయిన తర్వాత తెలంగాణ సీఎం ‘రేవంత్ రెడ్డి’ తెలుగు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి’ గారి చేతుల మీదుగా వెబ్ సైట్ ని లాంచ్ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు… మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్ని రకాలుగా ఒక్కోమెట్టు పైకి ఎక్కుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…