Vastu Tips: శనివారం రోజున ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకోకూడదు! తెస్తే శని మీ వెంటే!

Vastu Tips: మనదేశంలో నమ్మకాలు ఎక్కువ. అత్యధిక శాతం మంది జాతకాలు, శాస్త్రాలను నమ్ముతారు. ఏది కొనాలన్నా వాస్తును చూడడం తప్పనిసరిగా వస్తోంది. ఇక ఇంటి విషయంలో వాస్తుప్రకారమే అందరూ కడుతుంటారు. ఫాలో అవుతుంటారు. ఇంట్లోక వస్తువులను తెచ్చే విషయంలోనూ వాస్తు పాటిస్తారు. ఏ వస్తువును ఇతరుల నుంచి తీసుకోవాలి?ఏది తీసుకోకూడదన్న విషయంలో క్లారిటీతో ముందుకెళుతారు. ఈ క్రమంలోనే శనీశ్వరుని అనుగ్రహం మనపై పడకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఇలా శని ప్రభావం మనపై ఉండకుండా ఉండాలంటే […]

Written By: NARESH, Updated On : July 29, 2022 4:39 pm
Follow us on

Vastu Tips: మనదేశంలో నమ్మకాలు ఎక్కువ. అత్యధిక శాతం మంది జాతకాలు, శాస్త్రాలను నమ్ముతారు. ఏది కొనాలన్నా వాస్తును చూడడం తప్పనిసరిగా వస్తోంది. ఇక ఇంటి విషయంలో వాస్తుప్రకారమే అందరూ కడుతుంటారు. ఫాలో అవుతుంటారు. ఇంట్లోక వస్తువులను తెచ్చే విషయంలోనూ వాస్తు పాటిస్తారు. ఏ వస్తువును ఇతరుల నుంచి తీసుకోవాలి?ఏది తీసుకోకూడదన్న విషయంలో క్లారిటీతో ముందుకెళుతారు. ఈ క్రమంలోనే శనీశ్వరుని అనుగ్రహం మనపై పడకుండా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.ఇలా శని ప్రభావం మనపై ఉండకుండా ఉండాలంటే శనివారం పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి శనివారం ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు అనే విషయానికి వస్తే..

 

ఉప్పు: శనివారం పొరపాటున కూడా ఉప్పును ఇంటికి తెచ్చుకోకూడదు. ఇలా శనివారం ఉప్పుని కొనుగోలు చేయటం వల్ల ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పప్పులు: సూర్యుడు, అంగారకుడికి మధ్య భక్తులతో ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలిసిందే. అయితే శని, అంగారకుడికి మధ్య శత్రుత్వం ఉండటం వల్ల శనివారం పప్పులు కొనడం వల్ల శని ప్రభావం ఉంటుందని చెబుతారు.

 

ఆవనూనె: శనీశ్వరుడుకి ఎంతో ఇష్టమైన ఆవనూనెను శనివారం పొరపాటున కూడా కొనకూడదు. ఇలా ఆవనూనె కొనడం వల్ల శారీరక బాధలు అనారోగ్య సమస్యలు వస్తాయి కనుక శనివారం ఆవ నూనె కొనుగోలు చేయకూడదు.

ఇనుప వస్తువులు: శనివారం ఏదైనా ఇనుప వస్తువులను కొనుగోలు చేయడం వల్ల శని ప్రభావం మనపై ఉంటుంది. కానీ శనివారం ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల శని ప్రభావం దోషం తొలగిపోతుంది.

తోలుతో చేసిన వస్తువులు: శనివారం తోలుతో తయారు చేసిన ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదు. పర్సు, బెల్ట్, హ్యాండ్ బ్యాగులు వంటి వస్తువులను శనివారం కొనకూడదు. ఒకవేళ శనివారం ఇలాంటి వస్తువులను కొనుగోలు చేసిన మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది.

ఇక ఇతరుల బట్టలు, చెప్పులు, పెన్నులు అస్సలు వాడవద్దు.. అలా వాడితే శని, దురదృష్టం వంటివి మనకు వస్తాయని చెబుతారు. ఇక ఇతరుల కర్ఛీఫ్ ను వాడవద్దు. ఇలా చేయడం వల్ల లైఫ్ లో గొడవలు, బంధాలు , విడిపోవడం వంటివి జరుగుతాయి. ఇక ఉంగరాలను కూడా ఇతరులవి తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం, కెరీర్, ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇతరుల గడియారాలు ధరించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలా ధరిస్తే మీకు బైడ్ టైం మొదలవుతుందని స్పష్టం చేస్తున్నారు. సో ఈ వస్తువులు ఇతరులు నుంచి తీసుకుంటే మీకు అష్టదరిద్రం ఖాయమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.