Common Cold: జలుబుకు ఇప్పటికీ మందులు ఎందుకు లేవు.. ఎందుకు తయారు చేయలేదు?

జలుబుకు మందు ఎందుకు కనుక్కోలేకపోయారు? జలుబు రైనో వైరస్ అనే బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది. ఇందులో దాదాపు 200 వైరస్ లు ఉంటాయి.

Written By: Srinivas, Updated On : June 21, 2023 4:28 pm

Common Cold

Follow us on

Common Cold: మనకు అప్పుడప్పుడు జలుబు చేస్తుంది. జలుబుకు మాత్రం ఇప్పటి వరకు మందు కనుగొనలేదు. దీంతో జలుబు వచ్చిందంటే దానంతట అదే పోవాలి. ఇంతవరకు చాలా మంది జలుబుకు మందు కనుక్కోవాలని చూసినా కుదరలేదు. అన్ని రోగాలకు మందులు ఉన్నా ఒక్క దీనికి మాత్రం లేకపోవడం గమనార్హం. జలుబు చేస్తే మనం మందులు వాడాల్సిన పనిలేదు. దానంతట అదే నయం అవుతుంది. చాలా మంది ఆవిరి పడతారు.

జలుబుకు మందు ఎందుకు కనుక్కోలేకపోయారు? జలుబు రైనో వైరస్ అనే బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది. ఇందులో దాదాపు 200 వైరస్ లు ఉంటాయి. అందుకే దీనికి మందు కనుగొనడం వీలు కావడం లేదు. గత డెబ్బయి సంవత్సరాల నుంచి అనేక ఫార్మా సంస్థలు దీనికి మందు కనుగొనాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ కుదరడం లేదు.

జలుబుకు కారణమైన వైరస్ లు గొంతు భాగంలోనే ఉంటాయి. అక్కడ నుంచి వ్యాపిస్తూ లక్షణాలు రావడానికి కారణాలుగా మారుతాయి. జలుబు వచ్చినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అంతే కాని ఏవేవో మందులు వేసుకోవడం వల్ల ఇతర ఇబ్బందులు వస్తాయి తప్ప జలుబు నయం కాదు. మందులు లేకపోవడం వల్ల జాగ్రత్తలు తీసుకుంటే అది పోవడం ఖాయం.

జలుబు చేసినప్పుడు ఎక్కువ సమయం నిద్ర పోవడం మంచిది. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇలా చేయడం వల్ల జలుబును తొందరగా తగ్గించుకోవచ్చు. జలుబు చేసినప్పుడు తులసి ఆకులు నములుతుంటారు. నీలగిరి ఆకులు వాసన చూస్తుంటారు. ఇలా ఆయుర్వేద చిట్కాలు ఉపయోగించుకుని జలుబును దూరం చేసుకోవచ్చు.