Sneeze: తుమ్మినప్పుడు ‘చిరంజీవ’ అని ఎందుకంటారో తెలుసా?

Sneeze: ఎవరైనా ఆవలిస్తే వెంటనే పక్కన ఉన్న వారు కూడా ఆటోమేటిక్ గా అదే చేస్తారు. కానీ తుమ్మినప్పుడు పక్కన ఉన్న వారు మాత్రం తుమ్మరు. తుమ్ము అపశకునంగా భావిస్తారు. మనం బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తుమ్మును అంతలా అపవిత్రంగా చూస్తారు. తుమ్మినప్పుడు ఏ పని చేయరు. శుభకార్యాల్లో కూడా ఎవరైనా తుమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తుమ్ము విషయంలో ఇన్ని అవరోధాలు […]

Written By: Srinivas, Updated On : December 22, 2022 10:17 am
Follow us on

Sneeze: ఎవరైనా ఆవలిస్తే వెంటనే పక్కన ఉన్న వారు కూడా ఆటోమేటిక్ గా అదే చేస్తారు. కానీ తుమ్మినప్పుడు పక్కన ఉన్న వారు మాత్రం తుమ్మరు. తుమ్ము అపశకునంగా భావిస్తారు. మనం బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మితే వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తుమ్మును అంతలా అపవిత్రంగా చూస్తారు. తుమ్మినప్పుడు ఏ పని చేయరు. శుభకార్యాల్లో కూడా ఎవరైనా తుమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తుమ్ము విషయంలో ఇన్ని అవరోధాలు ఉన్నాయి.. తుమ్ముపై ఇంతటి కఠినమైన ఆంక్షలు ఎందుకు విధించారు. దాని వల్ల నష్టమేంటి అనేదానిపై స్పష్టత మాత్రం లేదు.

Sneeze

మనం తుమ్మినప్పుడు లిప్త కాలం పాటు మన గుండె ఆగిపోతోందట. అందుకే మనం తుమ్మినప్పుడు చిరంజీవ అంటారు. తుమ్మిన సమయంలో మన గుండె ఒక్క క్షణం పాటు ఆగుతుందట. అందుకే తుమ్మినప్పుడు చిన్న వారిని చిరంజీవ అని దీవించడం సహజం. అలా తుమ్ముకు చాలా వరకు అపనమ్మకాలు ఉన్నాయి. తుమ్మినప్పుడు ఎన్నో తుంపర్లు రావడం కామనే. అందుకే మనం తుమ్మేటప్పుడు చేతులు కానీ కర్చీఫ్ కానీ అడ్డు పెట్టుకోవాలి. లేకపోతే తుంపర్లు ఇతరుల మీదకు వెళితే వారికి కూడా ఏవైనా వైరస్ లు అంటుకునే ప్రమాదం ఉంటుంది.

నలుగురిలో తుమ్మేందుకు తడబాటు పడుతుంటాం. ఎందుకంటే ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తాం. అందుకే తుమ్ము తుమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. . ఎవరిమీదైనా పడితే బాగుండదనే ఉద్దేశంతో పక్కకు వెళ్లి తుమ్మేందుకు ఇష్టపడతాం. తుమ్ము అంతటి డేంజర్. తుమ్మినప్పుడు ఒక క్షణం మన గుండె ఆగుతుంది కాబట్టే మనం కళ్లు మూసుకుని తుమ్ముతాం. కళ్తు తెరిస్తే ఆ స్పీడుకు అవి ఊడి కిందపడిపోతాయట.. అందుకే అలా ఆటోమేటిక్ గా కనురెప్పలు మూసేస్తాయి.

Sneeze

తుమ్ము అనేక అనారోగ్య కారణాలకు సంకేతంగా కూడా చెబుతారు. తుమ్మినప్పుడు చిన్న పిల్లలనైతే ఎక్కువ కాలం జీవించాలనే ఉద్దేశంతో చిరంజీవ అని దీవించడం ఆనవాయితీ. తుమ్ముతో మన శరీరం తేలికగా అయినట్లు అనిపిస్తుంది. కానీ చుట్టు ఉన్న వారికి ఇబ్బందిగా తోస్తుంది.

తుమ్మినప్పుడు విదేశాల్లో కూడా అవరోధంగానే భావిస్తారు. వారు కూడా తుమ్మును పట్టించుకుంటారు. ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో తుమ్మినప్పుడు ‘బ్లెస్ యూ’ అని దీవిస్తుంటారు.ఇతర దేశాల్లో కూడా తుమ్మినప్పుడు దీవిస్తారు… తుమ్మినప్పుడు ఒక లిప్త కాలం గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుందని నమ్మకం. అందుకే ఇలా దీవిస్తారు. అయితే తుమ్ము శారీరకంగా వచ్చే ఓ అలవాటు మాత్రమే. దాన్ని అశుభంగా భావించడం మూఢనమ్మకంగానే చెబుతుంటారు.

Tags