White Rice: మనలో చాలామంది వైట్ రైస్ ను ప్రతిరోజూ తింటూ ఉంటారు. తెల్ల బియ్యంతో చేసిన అన్నం తింటే మాత్రమే కడుపు నిండినట్టు సంతృప్తిగా అనిపిస్తుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. నార్త్ ఇండియాలో నివశించే ప్రజలతో పోలిస్తే సౌత్ ఇండియాలో వైట్ రైస్ తినేవాళ్ల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ ఉంటుంది.
ఎవరైతే తెల్ల బియ్యంతో చేసిన అన్నం తింటారో వాళ్లకు శరీరానికి అవసరమైన పోషకాలు అందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వైట్ రైస్ కు బదులుగా ఇతర రైస్ లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఎవరైతే వైట్ రైస్ ను ఎక్కువగా తీసుకుంటారో వాళ్లను మధుమేహం, మలబద్ధకం, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
Also Read: జగన్ సర్కార్ కు ఫిర్యాదుల టెన్షన్.. సీన్ రివర్స్ అయ్యిందే..!
ఊబకాయం, హార్ట్ స్ట్రోక్, గుండె జబ్బులకు కూడా వైట్ రైస్ ఒక విధంగా కారణమవుతుందని చెప్పవచ్చు. వైట్ రైస్ ప్రతిరోజూ తినేవాళ్లను అధిక కొలెస్ట్రాల్ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ మంచిదని సూచనలు చేసింది. ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
వైట్ రైస్ ను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. వైట్ రైస్ లో పూర్తిస్థాయిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. తరచూ వైట్ రైస్ తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పూర్తిగా వైట్ రైస్ పై ఆధారపడటం వల్ల శరీరానికి నష్టమే తప్ప లాభం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: హిజాబ్ వివాదం వెనుక అసలు కారకులు ఎవరు?