WHO : టీబీ అంటే క్షయవ్యాధి మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన, ప్రాణాంతకమైన వ్యాధి. సాధారణంగా ఊపిరితిత్తులపై దాడి చేసే బ్యాక్టీరియా వ్యాధి . కానీ ఇది మూత్రపిండాలు, వెన్నెముక, మెదడుతో సహా శరీరంలోని ఇతర భాగాలపై కూడా దాడి చేస్తుంది. ఇది సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ముల ద్వారా ఇంకొకరికి వ్యాపించే అంటు వ్యాధి. గత ఏడాది 12.5 లక్షల మంది ప్రాణాలను బలితీసుకుందంటే అది ఎంతటి వినాశకరమైనదో అంచనా వేయవచ్చు. ఇప్పటికే ప్రపంచ జనాభాలో నాలుగింట ఒక వంతు మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. గత ఐదేళ్లలో జననేంద్రియ టిబితో పోరాడుతున్న మహిళల సంఖ్య 10శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టీబీ పేషెంట్స్, టీబీ మరణాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. మహిళలలో టీబీ సమస్య పెరిగిపోతుంది.
ఈ వ్యాథికి సంబంధించి ప్రపంచానికి ఓ రిలీఫ్ వార్త వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ( WHO)టీబీకి సంబంధించిన మొదటి పరీక్షను ఆమోదించింది. ఈ MTB/RIF అల్ట్రా పరీక్ష, అమెరికన్ కంపెనీ Cepheid ద్వారా తయారు చేయబడింది. టీబీ నిర్ధారణ, యాంటీబయాటిక్ సెన్సిటివిటీని గుర్తించడం కోసం నిర్వహించి మొదటి పరీక్ష ఇది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పరీక్షతో సహా ఖచ్చితత్వం, నాణ్యత పరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే మొదటి టీబీ పరీక్ష ఇది. నిజానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ప్రమాణాల ఉద్దేశ్యం ఏమిటంటే.. అవసరమైన ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు సురక్షితంగా, ప్రభావవంతంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడడమే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఈ పరీక్ష ఆమోదం నాణ్యత స్థాయికి సరిపోతుందని చూపిస్తుంది. ఈ పరీక్ష భవిష్యత్తులో టీబీని వీలైనంత త్వరగా ఎదుర్కోవడంలో.. చికిత్సకు ప్రజల్లో నమ్మకాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. టీబీని ప్రాణాంతక వ్యాధిగా గుర్తించినప్పటికీ, దాని గురించి భరోసా ఇచ్చే విషయం ఏమిటంటే దాని చికిత్స సాధ్యమే. ఇదిలావుండగా, ఏటా మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ వ్యాధి ఊపిరితిత్తులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కానీ శరీరంలోని అనేక ఇతర భాగాలు కూడా దీని బారిన పడతాయి.
రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధి కారణంగా హెచ్ఐవి సోకిన వారు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. 2023లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.08 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో దాదాపు 60 లక్షల మంది పురుషులు కాగా, 36 లక్షల మంది మహిళలు ఉన్నారు. అంతే కాదు, ఈ వ్యాధి 13 లక్షల మంది పిల్లలు దీనికి బాధితులుగా మారారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Whos key decision regarding tb a disease that has claimed millions of lives
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com