Curd: పాలు, పెరుగు వంటివి తినడం చాలా మందికి ఇష్టం. ఇక అన్నం తిన్న తర్వాత ఒక ముద్ద అయినా పెరుగు తినాలి అనిపిస్తుంది. వేసవి కాలంలో దీని డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన కడుపును చల్లగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది పెరుగు. కొందరు పెరుగులో ఉప్పు వేసి తింటే మరికొందరు చక్కెర వేసుకుంటారు. కొందరు వట్టి పెరుగును మాత్రమే తింటారు. మరి ఉప్పు, చక్కెర ఈ రెండింటిలో ఏది మంచిది అనే వివరాలు ఓ సారి చూసేయండి.
పెరుగును ఎలా తినాలి? దీని వల్ల ఫిట్ గా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం. పెరుగులో ఏది కలుపుకుని తినాలో తెలియక చాలామంది అనుమానంతో ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం, మీరు పెరుగులో చక్కెర లేదా ఉప్పు వేయకుండా, సాదాగా తినడానికి ప్రయత్నించండి. ఉప్పు, లేదా చక్కెర ఏది లేకుండా తినకపోతే కాస్త చక్కెరతో తినండి.
మధ్యాహ్నం, రాత్రి సమయంలో కాస్త ఉప్పు కలుపుకొని తినండి. మొత్తం మీద రాత్రిపూట పెరుగు తినకుండా ఉండటానికి ట్రై చేయండి. కొందరికి ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల సమస్యలు కూడా రావచ్చు. అలాగే పెరుగులో తేనె, నెయ్యి, పంచదార, ఉసిరికాయ కలిపి తింటే ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. డయాబెటిక్ ఉన్నవారు చక్కెరకు బదులుగా ఉప్పు కలపుకొని తినాలి. ఉప్పు కలిపి పెరుగును తినడం వల్ల జీర్ణం అవుతుందట. కానీ అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం ఉప్పుతో తినకూడదు అంటున్నారు నిపుణులు. తింటే కచ్చితంగా బీపీ వస్తుందట.
స్ట్రోక్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. పెరుగు లస్సీ కూడా వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పెరుగులో చక్కెరను కలిపి తింటే చల్లదనం అంటారు నిపుణులు. దీని వల్ల మీరు వేడి నుండి ఉపశమనం పొందుతారు. దీంతో పాటు శరీరంలో శక్తి వచ్చి తాజాదనాన్ని కలిగిస్తుంది. హైడ్రేషన్ కూడా బాగానే ఉంటుంది . నీటి కొరత ఉండదు. కాబట్టి పెరుగును తినండి. కానీ కాస్త జాగ్రత్తగా తెలుసుకొని తినండి.