https://oktelugu.com/

Rice : ఇంతకీ అన్నం ఎప్పుడు తినాలి? ఏ రైస్ తీసుకోవాలి? ఈ విషయంలో 90 శాతం మంది తప్పే చేస్తున్నారు.

ఇతర ఆహారాలు తీసుకున్నా సరే మాకు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, లేదంటే కడుపు నిండిన పీల్ ఉండదు అని అన్నమే తింటారు. మరి ఈ రైస్ తినడం మంచిదేనా? తింటే ఎంత తినాలి? ఎలాంటి నియమాలు ఈ విషయంలో పాటించాలి అనే వివరాలు పంచుకున్నారు న్యూ ఢిల్లీలోని PSRI హాస్పిటల్‌కు చెందిన డైటీషియన్ దేవయాని బెనర్జీ. మరి అవేంటో మీరు కూడా తెలుసుకోండి.

Written By: , Updated On : January 30, 2025 / 03:00 AM IST
Eating Rice

Eating Rice

Follow us on

Rice :  భారతీయులు ఎక్కువగా రైస్ నే తింటారు. ఇక ఏదైనా స్పెషల్ ఉంటే మాత్రం పక్కా బాస్మతి రైస్ ఉండాల్సిందే. ఎందుకంటే ఈ అన్నంలోని సువాసన, రుచి అందరినీ ఆకర్షిస్తుంది. అయితే, ప్రస్తుత ఆరోగ్యం, ఫిట్‌నెస్ పోకడల కారణంగా, చాలా మంది ప్రజలు బియ్యానికి బదులుగా క్వినోవా వంటి అధిక ఫైబర్ ధాన్యాలను తీసుకోవడం ప్రారంభించారు. కానీ రైస్ ను సరైన సమయంలో, సరైన పరిమాణంలో తీసుకుంటే, అది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే అన్నం తినడమే చాలా మందికి ఇష్టం. ఇతర ఆహారాలు తీసుకున్నా సరే మాకు తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదని, లేదంటే కడుపు నిండిన పీల్ ఉండదు అని అన్నమే తింటారు. మరి ఈ రైస్ తినడం మంచిదేనా? తింటే ఎంత తినాలి? ఎలాంటి నియమాలు ఈ విషయంలో పాటించాలి అనే వివరాలు పంచుకున్నారు న్యూ ఢిల్లీలోని PSRI హాస్పిటల్‌కు చెందిన డైటీషియన్ దేవయాని బెనర్జీ. మరి అవేంటో మీరు కూడా తెలుసుకోండి.

అన్నం తినడానికి సరైన సమయం
చాలా మంది సమయ పాలన లేకుండా ఆహారం తీసుకుంటారు. ముఖ్యంగా రైస్ ను తింటారు. అయితే మధ్యాహ్నం అన్నం తినడం ఆరోగ్యకరం. బియ్యంలో బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా, అన్నం తక్కువ కేలరీల ఆహారం. కాబట్ి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరాన్ని ఎక్కువ కాలం పాటు నిండుగా ఉండేలా చేస్తుంది.

రాత్రిపూట అన్నం తింటే ప్రమాదాలు
ఇక చాలా మంది రాత్రి కూడా అన్నమే ఆహారంగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది. దీని కారణంగా రాత్రి భోజనంలో అన్నం తినడం వల్ల అర్ధరాత్రి ఆకలి కూడా వేస్తుంటుంది. మీరు వైట్ రైస్ తింటుంటే, చక్కెర పెరిగే ప్రమాదం ఉంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఏ బియ్యం ఆరోగ్యానికి మంచిది?
వైట్ రైస్‌తో పోలిస్తే, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, గ్రే రైస్ వంటి బియ్యం రకాలలో ఎక్కువ ఫైబర్, విటమిన్లు, మినరల్స్‌లో పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినవచ్చు.

తెల్ల బియ్యం, దాని ప్రభావాలు
వైట్ రైస్ సాధారణంగా తింటారు. కానీ ఇందులో ఫైబర్, పోషకాలు లేవు. వైట్ రైస్ అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ప్రభావితం అవుతాయి.

అన్నం ఎంత తినాలి?
వైట్ రైస్‌లో 100 గ్రాముల వండిన అన్నంలో దాదాపు 130 కేలరీలు ఉంటాయి. అయితే సాధారణ సర్వింగ్ (200 గ్రాములు)లో 260 కేలరీలు ఉంటాయి. మరోవైపు, బ్రౌన్ రైస్‌లో 100 గ్రాముల వండిన అన్నంలో 110 కేలరీలు ఉంటాయి, అయితే ఇది ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ఎంపికగా మారుతుంది. ఎక్కువ కాలం శక్తిని అందిస్తుంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.