Best walking posture:బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లడమే ఏకైక మార్గం అనుకుంటారు. కానీ ఈ వ్యాసం మీ మనసు మార్చుకోవచ్చు! కేవలం నడక ద్వారా కూడా బరువు వేగంగా తగ్గవచ్చని మీకు తెలుసా? అవును, భారీ వ్యాయామాలు, యంత్రాల సహాయం లేకుండా కూడా మీరు మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించవచ్చు. అంతేకాదు ఒక మినట్ కు వంద అడుగులు వేస్తే మీరు ఎన్ని ప్రయోజనాలు పొందుతారో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏంటి ఆ ప్రయోజనాలు అనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు ఛలో ఎంటర్ అవండి.
Also Read: ఈ తెల్లని ఇసుక బీచ్ లను చూశారా? స్వర్గానికి తక్కువ కాదు..
“నడక ఆరోగ్యానికి మేలు చేస్తుంది” అని మీరు చాలాసార్లు విని ఉంటారు, కానీ సరైన మార్గంలో నడవడం వల్ల అది సాధారణ వ్యాయామంలా ఉండదు. బరువు తగ్గడానికి శక్తివంతమైన సాధనంగా కూడా మారుతుంది. నడక కొన్ని విధాలుగా జరిగితే, అది జాగింగ్, పరుగు లాగా ప్రభావవంతంగా ఉంటుంది.
బరువు తగ్గడానికి నడవడం ముఖ్యం కాదు. ఎలా నడుస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. నడుమును నిటారుగా ఉంచి వెనక్కి ఆడిస్తూ వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే వెన్నుపూస అసలు అలిసిపోదు. షూస్ చాలా ముఖ్యం. మంచివి మెయింటెన్ చేయాల్సిందే. లేదంటే పాదాల మీద బరువు పడి మీరు అలిసి పోతారు. కాళ్ల నొప్పులు కూడా రావచ్చు. వేగంగా నడవాలి. కానీ గుండె వేగం పెరిగేలా మాత్రం కాదు. నిమిషానికి 100 అడుగుల టార్గెట్ బెటర్. ఫోన్ చూస్తూ అసలు నడవద్దు. ప్రయోజనం ఉండదు. వాకింగ్ పై ధ్యాస పెట్టి నడవాలి.
మెల్లగా వేగం పెంచి నడవాలి. ఒకేసారి వేగం పెంచడం మంచిది కాదు. వాకింగ్ ప్లేస్ కూడా చాలా ముఖ్యం. పార్క్ లు, పచ్చటి మైదానాలను ఎంచుకోండి. రోజు 5 కి. మీ నడవాల్సిన అవసరం లేదు. 30 ని. లు సరిగ్గా నడిస్తే సరిపోతుంది. వాకింగ్ కు ముందు, తర్వాత నీరు తీసుకోవాలి. అలసట, నీరసం, నొప్పి ఉంటే బలవంతంగా వాకింగ్ చేయకండి. ఎప్పుడైనా నడవడం వల్ల బరువు తగ్గుతుందని అనుకుంటున్నారా? అసలు కాదు. మంచి సమయంలో నడవాలి.
ఉదయం ఖాళీ కడుపుతో నడవడం బెటర్. ఇది శరీరం నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మార్చుతుంది. దీని వల్ల కొవ్వు బర్న్ అవుతుంది. రాత్రి భోజనం తర్వాత నడవండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వు నిల్వను నివారిస్తుంది. మధ్యాహ్నం తేలికపాటి నడక కూడా అవసరమే. భోజనం తర్వాత తేలికపాటి నడక జీవక్రియను పెంచుతుంది. శరీరం రోజంతా ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.
Also Read: వీరు మర్చిపోయి కూడా బీట్ రూట్ ను తినవద్దు? ఈ లిస్ట్ లో మీరు ఉన్నారు?
బరువు తగ్గడానికి ప్రతిరోజూ కనీసం 10,000 అడుగులు పూర్తి చేయాలి. మీరు మొదట్లో 5,000 అడుగులు కూడా పూర్తి చేయలేకపోతే, క్రమంగా మీ స్టెప్స్ పెంచితే సరిపోతుంది. ఇంట్లో లేదా ఆఫీసులో నడవడం అలవాటు చేసుకోండి. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కండి. మీ రోజువారీ లక్ష్యాన్ని తెలుసుకోవడానికి స్మార్ట్‌వాచ్ లేదా మొబైల్ యాప్‌ని ఉపయోగించి మీ దశలను ట్రాక్ చేయండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.