Onion Cutting Tips
Onion Cutting Tips: ‘ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు’ అని అంటారు. ఎందుకంటే తల్లి కంటే ఎక్కువగా ఉల్లిపాయ ఏడిపిస్తుంది. వంటింట్లో ఉండేవారు ప్రతిరోజూ ఉల్లిపాయ కారణంగా ఏడుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫర్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కళ్లు మండి.. కళ్ల నుంచి నీళ్లు రప్పిస్తాయి. సాధారణంగా ఈ ప్రక్రియ ప్రతి ఇంట్లో జరిగేదే. కాన హోటళ్లలో లేదా ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయ కట్ చేసినప్పుడు వారి పరిస్థితి ఏంటి? వారికెందుకు కన్నీళ్లు రావు? అసలు కన్నీళ్లు రాకుండా ఏం చేయాలి? ఇప్పుడా వివరాలు తెలుసుకుందాం..
ఉల్లిపాయ మట్టిలో పెరుగుతుంది. ఇది భూమిలోప ఉండే సల్ఫర్ ను పీల్చుకుంటుంది. దీనిని అలాగే బయటకు తీసి కట్ చేస్తూ ఉంటారు. ఇలా కట్ చేయడం వల్ల ఉల్లిపాయలో ఉండే సెల్స్ బ్రేక్ అయిన అందులో నుంచి సల్ఫర్ కాంబోజ్, అలినేజ్ అనే ఎంజైమ్ లు బయటకు వస్తాయి. ఈ రెండు కలిపి గ్యాస్ గా తయారవుతాయి. ఇది కళ్లలోకి వెళ్లినప్పుడు లాక్రోమల్ గ్లాడ్ కన్నీళ్లను తెప్పిస్తాయి. అయితే ఉల్లిపాయను కోసినప్పుడు కన్నీళ్లు రాకుండా చిన్న చిట్కాలను పాటించితే ఈ సమస్య ఉండదు. అవేంటంటే?
ఉల్లిపాయను కోసే ముందు వీటిని నీళ్లలో కనీసం 10 నిమిషాలు చల్లటి నీళ్లలో ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇందులో నుంచి సల్ఫర్ కరిగిపోతుంది. ఆ తరువాత వీటిని కోయడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అలాగే ఉల్లిపాయను కనీసం 10 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కూడా ఈ సమస్య ఉండదు. ఇక ఇంట్లో గాగుల్ ఉంటే వాటిని ధరించి ఉల్లిపాయను కోయడం వల్ల కన్నీళ్లు రాకుండా ఉంటాయి. ఇక ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంటే ఈ ఫ్యాన్ గాలి ఒక సైడ్ కు వెళ్లేలా ఏర్పాటు చేసుకొని ఆ తరువాత ఉల్లిపాయను కట్ చేయాలి. ఇక హోటళ్లలో ఉల్లిపాయను కోయడం వల్ల కన్నీళ్లు రాకుండా ఉండాలంటే వీటిని స్పీడ్ గా కట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా సమస్ ఉండదు.
అయితే ఉల్లిపాయలు కట్ చేయడం వల్ల ఈ సమస్య ఉంటుందని వీటిని తినడం మానేయడం అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఉల్లిపాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ప్రాసెస్ చేసిన తరువాత కంటే పచ్చివి తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.వీటిని మధ్యాహ్నం భోజనం సమయంలో లేదా రాత్రి భోజనం సమయంలో ఆహారంతో తీసుకోవచ్చు. అలాగే మార్నింగ్ సలాడ్ గా తీసుకున్నా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల ఉల్లిపాయను ఏదో రకంగా తీసుకోవడం చేస్తూ ఉండాలి. నిత్యం ఉల్లిపాయను తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఇది గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. జీర్ణ సమస్య ఉన్న వారు దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడుతారు. శ్వాస వ్యవస్థ బలోపేతం కావడానికి ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది.