Health Precautions: ఆరోగ్యంగా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఉదయం పూట రాత్రి నానబెట్టిన ఐదు బాదం పలుకులు తినండి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మామూలు టీకి బదులు గ్రీన్ తాగండి. మూడు పచ్చి టమాటాలు తినండి.

Written By: Srinivas, Updated On : May 4, 2023 8:53 am

Health Precautions

Follow us on

Health Precautions: మనం ఆరోగ్యం కోసం ఎన్నో పనులు చేస్తుంటాం. తిండి విషయంల కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. మారుతున్న కాలంలో మన ఆహార శైలి కూడా మారాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేయడం సహజం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే ఆహారాలపైనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. కానీ మనలో చాలా మంది ఏవేవో తింటుంటారు. దీంతో ఆరోగ్యం దెబ్బతింటుంది.

రోజు మనం ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగాలి. దీంతో మలబద్ధకం సమస్య లేకుండా పోతోంది. దీని వల్ల మలవిసర్జన సాఫీగా సాగుతుంది. మన ఆరోగ్యానికి మొదటి మెట్లు ఇదే. తరువాత ఉదయం అల్పాహారం సరైన సమయంలో తీసుకోవాలి. ఉదయం 8.30 లోగా టిఫిన్ చేయాలి. అందులో నూనె పదార్థాలు కాకుండా సులభంగా జీర్ణమయ్యేవి తీసుకోవడం ఉత్తమం.

ఉదయం పూట రాత్రి నానబెట్టిన ఐదు బాదం పలుకులు తినండి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మామూలు టీకి బదులు గ్రీన్ తాగండి. మూడు పచ్చి టమాటాలు తినండి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉంటుంది. మన ఆరోగ్య పరిరక్షణలో ఇవి కూడా భాగమే. అందుకే వీటిని తినేందుకు మనం చొరవ చూపాల్సిందే. రోజు తింటేనే మంచిది.

దానిమ్మ గింజలను తినండి. ఓ ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. క్రమం తప్పకుండా ఇవి చేస్తే మనకు అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఆయుర్వేదంలో ఇలాంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని కచ్చితంగా తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి.