Healthy Habits: మనలో చాలామంది నిద్ర లేచిన వెంటనే కొన్ని అలవాట్లను పాటిస్తూ ఉంటారు. ఈ అలవాట్లలో కొన్ని మంచి అలవాట్లు ఉంటే కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను పాటించడం వల్ల చాలా సందర్భాల్లో లాభం వచ్చే అవకాశాల కంటే నష్టం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నిద్ర లేచిన తర్వాత ఏ విషయం గురించైనా పాజిటివ్ గానే ఆలోచించాలి. నెగిటివ్ థాట్స్ వల్ల కొన్నిసార్లు అనుకున్న ఫలితాలను పొందలేము.
ప్రతిరోజూ నిద్ర లేచిన తర్వాత ఆరోజు చేయాల్సిన ముఖ్యమైన పనులకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రణాళిక సిద్ధం చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు మనం ఊహించిన విధంగా పనులు జరిగే అవకాశం ఉంటుంది. ప్లాన్ ప్రకారం పనులు చేయడం ద్వారా ఇతరులకు కూడా మనపై సదభిప్రాయం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
ఉదయం సమయంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యకరమైన అలవాటు మాత్రం కాదు. ఉదయం కడుపునిండా తింటే ఆరోగ్యానికి మంచిది. నిద్ర లేచిన వెంటనే మనలో చాలామంది కొంత సమయం ఫోన్ తో బిజీ అవుతుంటారు. ఈ అలవాటు కూడా మంచి అలవాటు కాదు. ఈ అలవాటును దూరం చేసుకుంటే ఎంతో మంచిదని చెప్పవచ్చు.