https://oktelugu.com/

Neera- Kallu: కల్లుకు, నీరాకు తేడా ఏంటి? నీరాను చెట్టు నుంచి ఎలా తీస్తారు?

నీరా కల్లుకు తేడా ఉంటుంది. కల్లులో అల్కహాల్ ఉంటుంది. కానీ నీరాలో ఉండదు. సహజసిద్ధంగా లభించే నీరాతో ఎన్నో లాభాలున్నాయి. తాటి, ఈత, కొబ్బరి, ఖర్జూర, జీలుగ వంటి చెట్ల నుంచి నీరా దొరుకుతుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : May 5, 2023 / 11:41 AM IST
    Follow us on

    Neera- Kallu: ప్రస్తుతం చాలా మందిలో వస్తున్న సమస్య కిడ్నీల్లో రాళ్లు రావడం. దీంతో వైద్యులు నీరా తాగాలని సూచిస్తున్నారు. మన కిడ్నీల్లో ఉండే రాళ్లను తొలగిండంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే నీరాతో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అందుకే నీరాతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీరా తాగడం వల్ల మనకు పలు రకాల సమస్యల నుంచి బయట పడే అవకాశం కలుగుతుంది. నీరా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా నీరా కేఫ్ నిర్వహిస్తోంది.

    నీరాకు కల్లుకే తేడా

    నీరా కల్లుకు తేడా ఉంటుంది. కల్లులో అల్కహాల్ ఉంటుంది. కానీ నీరాలో ఉండదు. సహజసిద్ధంగా లభించే నీరాతో ఎన్నో లాభాలున్నాయి. తాటి, ఈత, కొబ్బరి, ఖర్జూర, జీలుగ వంటి చెట్ల నుంచి నీరా దొరుకుతుంది. నీరాను సూర్యోదయానికంటే ముందే తాగాలి. ఉష్ణోగ్రత మరో ఆరు డిగ్రీలు పెరిగితే అది పులిసిపోతుంది. కల్లుగా మారుతుంది. ఉదయాన్నే దాన్ని చెట్టు నుంచి తీసుకుని తాగడం మంచిది.

    కల్లు ఎలా తీస్తారు

    కల్లు కావాలంటే అందులో ఈస్ట్ కలుపుతారు. దీంతో అది పుల్లగా ఉంటుంది. అల్కహాల్ ఉండటంతో దాన్ని తాగడం వల్ల నిషా వస్తుంది. నీరా మాత్రం కొబ్బరి నీళ్లలాగా తియ్యగా ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీరా అందరు తాగినా కల్లు మాత్రం అందరు తాగరు. నీరా తాగడానికే ఉత్సాహం చూపుతారు. కల్లు కంటే నీరాకు బాగా మంది ఆకర్షితులవుతారు. నీరాను మాత్రం ప్రత్యేకంగా తీస్తారు. దాని కోసం ఒక రోజు ముందే కుండ కట్టి సేకరిస్తారు.

    నీరాతో ఏ లాభాలు

    నీరా తాగడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఇది తీసుకుంటే పిల్లల నుంచి ముసలి వారి వరకు ఎంతో బెనిఫిట్ దక్కుతుంది. ముసలి వారికి కీళ్లు, కాళ్ల నొప్పులు దూరమవుతాయి. మధుమేహాన్ని అదుపు చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రెగ్యులర్ గా తాగితే చర్మ సౌందర్యం పెరుగుతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఎముకలను బలంగా చేస్తుంది. వాంతులు, విరేచనాలు, కామెర్లు, టైఫాయిడ్ వంటి వాటిని దూరం చేస్తుంది.