https://oktelugu.com/

Train : రైలులోని ఒక భోగి ధర ఎంత? మొత్తం రైలు బుక్ చేస్తే ఎంత రేటు అంటే?

దీంతో మనకు సులభమైన పద్ధతిగానే ఉంటుంది. రిజర్వేషన్ చేసుకున్న తరువాత 30 రోజుల నుంచి ఆరు నెలల సమయంలో మనం దీన్ని వాడుకోవాలి.

Written By: Srinivas, Updated On : May 15, 2023 11:20 am
Follow us on

Train : మనలో చాలా మంది రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో రైలు ఎక్కి ఎటైనా వెళ్తుంటాం. రోడ్డు మార్గాలకంటే రైలు మార్గం ద్వారా మనకు డబ్బు తక్కువగానే ఖర్చవుతుంది. దీంతో ఎక్కువ మంది రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతారు. రైగా రక్షణ కూడా ఉంటుంది. దీంతో మనం రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటాం. ఇందులో మనకు ఎన్నో సదుపాయాలు ఉంటాయి.

మన ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు బస్సులు బుక్ చేసుకుంటాం. కానీ రైలులో కూడా మనం ఒక కోచ్  ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే రైలునే బుక్ చేసుకోవచ్చు. దీనికి మనం ఆరు నెలలు ముందుగానే రైల్వే శాఖను సంప్రదిస్తే మనకు అన్ని వివరాలు చెబుతారు. కోచ్ కు ఓ రేటు, మొత్తం రైలుకు ఇంకో రేటు ఉంటుంది. మనం కావాలనుకుంటే బుక్ చేసుకుని వాడుకోవచ్చు

దీనికి మనం చేయాల్సింది ఏమిటంటే స్పెషల్ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కుటుంబం కోసం https;//www.ftr.ictc.co.in/ftr/ సైట్ లోకి వెళ్లాలి. మీరు యూజర్ ఐడీ నేమ్, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. దీంతో మనం మొత్తం రైలును బుక్ చేసుకోవాలా? ఒక కోచ్ మాత్రమే కావాలా? అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనకు కావాల్సిన దానిపై క్లిక్ చేస్తే చాలు. మనకు బుక్ చేసుకోవచ్చు. ఇలా రైలును బుక్ చేసుకుని మన అవసరాలు తీర్చుకోవచ్చు.

మరి దీనికి ఎంత చెల్లించాలి? ఎలా చెల్లించాలి? అనే అనుమానాలు రావడం సహజమే. మనకు కోచ్ మాత్రమే కావాలంటే రూ. 50 వేలు, రైలు మొత్తం కావాలంటే రూ. 9 లక్షల వరకు చెల్లించాలి. దీంతో మనకు సులభమైన పద్ధతిగానే ఉంటుంది. రిజర్వేషన్ చేసుకున్న తరువాత 30 రోజుల నుంచి ఆరు నెలల సమయంలో మనం దీన్ని వాడుకోవాలి.