Pink Salt: ఇటీవల సాధారణ ఉప్పు, సముద్ర ఉప్పుకు బదులుగా హిమాలయన్ సాల్ట్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది. గులాబీ రంగు రాతి ఉప్పులా ఉండే ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో తయారు చేస్తారు. దీన్ని ‘పింక్ సాల్ట్’ అని కూడా పిలుస్తారు. ఇండియాతోపాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఈ ఉప్పును ఉత్పత్తి చేస్తున్నారు. హిమాలయా పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి ఈ ఉప్పును తయారు చేస్తారు. సాధారణ ఉప్పులా కాకుండా.. ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు పింక్ కలర్‌లో ఉంటుంది. అయితే, ఇది చాలా అరుదుగా లభించే ఉప్పు. దాని ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మరి, ఈ ఉప్పును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? రాతితో తయారయ్యే ఉప్పు.. సముద్రపు ఉప్పు కంటే సురక్షితమైనదా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు ‘పింక్ సాల్ట్’ వల్ల కలిగే ప్రయోజనాలను తోసిపుచ్చారు. ఇది వైట్ టేబుల్ సాల్ట్ కంటే మెరుగైనది కాదని అంటున్నారు.
రోడ్ల పక్కన విక్రయాలు..
పింక్ సాల్ట్‌లో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నయాని ప్రచారం జరుగడంతో దీని వినియోగం పెరుగుతోంది. ఇదే అదనుగా కొంతమంది పింక్‌సాల్ట్‌ను ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. ఇటీవల పింక్ సాల్ట్ రాక్‌లను మోసుకెళ్లే అనేక ట్రక్కులు హైదరాబాద్‌లో, జాతీయ రహదారుల పక్కన కనిపిస్తున్నాయి. కిలో ఉప్పును రూ.80కి విక్రయిస్తున్నారు. ఈ ఉప్పు బీపీ, షుగర్‌ను కంట్రోల్ స్తుందని, థైరాయిడ్‌ను నియంత్రిస్తుందని చెబుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉంటాయంటున్నారు.
అధిక వినియోగంతో దుష్రపభావాలు..
అయితే ఈ పింక్ సాల్ట్‌ను అధికంగా వినియోగించడం ద్వారా దుష్ప్రభావాలకు దారితీయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో తవ్విన గులాబీ ఉప్పులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మరియు పొటాషియం ఉన్నాయి. అయితే, ఇందులో ఇతర ఉప్పుతో సమానమైన నష్టాలను కలిగి ఉందని నిపుణులు తేల్చారు. ఇది అయోడైజ్ చేయబడదు, కాబట్టి హిమాలయన్ ఉప్పును మాత్రమే ఉపయోగించడం వల్ల అయోడిన్ లోపం ఏర్పడుతుంది. హిమాలయన్ ఉప్పుకు ఇతర రకాల ఉప్పుల మాదిరిగానే ప్రమాదాలు ఉన్నాయని ఇటీవల గుర్తించారు.
ఇవీ నష్టాలు..
సాధారణ ఉప్పు మాత్రమే కాకుండా.. హిమాలయన్ పింక్ సాల్ట్ వల్ల కూడా సమస్యలున్నాయి. అందుకే ఏ రకం ఉప్పునైనా సరే.. మితంగా తీసుకోవడం ముఖ్యం.
= ఈ ఉప్పులో ప్రమాదకరమైన అర్సెనిక్, మెర్క్యూరీ, లీడ్ కూడా ఉన్నాయట. అందుకే, ఈ ఉప్పును కూడా మితంగా తీసుకుంటనే మేలని చెబుతున్నారు.
= అధిక ఉప్పు రక్తపోటుకు కారణమవుతుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా సీకేడీ, గుండె వ్యాధులకు దారితీయొచ్చు.
= ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మీ శరీరం నుంచి బయటకు వెళ్లే కాల్షియం స్థాయి పెరుగుతుంది.
= అధిక ఉప్పు వివిధ రకాల ఎముకల వ్యాధికి గురిచేస్తుంది. అని పరిశోధనల్లో తేలింది.
ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి అధికంగా డబ్బులు పెట్టి పింక్ సాల్ట్‌తోపాటు రోగాలు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.