Homeహెల్త్‌Penile Cancer: ఏమిటి ఈ పెనైల్ క్యాన్సర్.. మగవాళ్ళు ఎందుకు భయపడుతున్నారు?

Penile Cancer: ఏమిటి ఈ పెనైల్ క్యాన్సర్.. మగవాళ్ళు ఎందుకు భయపడుతున్నారు?

Penile Cancer: అతడి పేరు జాన్ (పేరు మార్చాం) వయసు 63 కు పైగానే.. సొంత దేశం బ్రెజిల్. అక్కడ జాన్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. కొంతకాలం క్రితం అతడు పదవి విరమణ పొందాడు. పదవి విరమణ అనంతరం జీవితాన్ని దర్జాగా గడుపుతున్నాడు.. అతడు సమతుల ఆహారం తీసుకుంటాడు. ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు ఈ క్రమంలో తన పురుషాంగంపై మొటిమ లాంటిది పెరగడం గమనించాడు. మొదట్లో దానిని జాన్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వైద్యులను సంప్రదించాడు. వారు పరీక్షించి అది అదనపు చర్మం అని కొట్టిపడేశారు. మందులు రాసి పంపించారు. మందులు వాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అది జాన్ వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. అతడు తన భార్యతో లైంగిక ఆనందానికి దూరమయ్యాడు. ఇలా ఐదు సంవత్సరాలపాటు వైద్యుల చుట్టూ తిరిగి.. వారు రాసి ఇచ్చిన మందులను వాడినప్పటికీ జాన్ సమస్య పరిష్కారం కాలేదు.

అయితే 2023లో ఓ వైద్యుడి సలహా మేరకు జాన్ అధునాతన పరీక్షలు నిర్వహించుకోగా అతనికి పురుషాంగ క్యాన్సర్.. వైద్య పరిభాషలో పెనైల్ క్యాన్సర్ సోకిందని నిర్ధారణ అయింది. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా జాన్ పురుషాంగంలో కొంత భాగాన్ని కత్తిరించారు. ఈ క్యాన్సర్ చాలా అరుదుగా వస్తుందట. ఇటీవల ఈ తరహా కేసులు పెరిగాయట. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడంతో మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయట. తాజా అధ్యయనాల ప్రకారం బ్రెజిల్ దేశంలో లక్ష మంది పురుషుల్లో 2.1 మంది ఈ తరహా క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. బ్రెజిల్ వైద్య ఆరోగ్యశాఖ నివేదికల ప్రకారం 2012 నుంచి 2022 మధ్య 21,000 కేసులు నమోదయ్యాయి. వీరిలో నాలుగు వేలకు పైగా మంది చనిపోయారు.

గత దశాబ్ద కాలంలో 6,500 మంది కంటే ఎక్కువ పురుషులు తమ అంగాన్ని తొలగించుకోవలసి వచ్చింది. దీని ప్రకారం ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ వ్యాధికి సంబంధించి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారన్నమాట. బ్రెజిల్ దేశంలో అత్యంత పేద రాష్ట్రమైన మారన్ హవావ్ లో లక్ష మంది పురుషుల్లో 6.1 మంది పురుషాంగ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. పురుషాంగం మీద పుండు లాంటిది ఏర్పడితే.. అది ఈ తరహా క్యాన్సర్ అని భావించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆ తరహా పుండ్లు ఏర్పడితే.. అది క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాంటి క్యాన్సర్ కేసుల్లో పురుషాంగం పై ఏర్పడిన గాయం నుంచి దుర్వాసన వస్తుందట. ఆ పుండు ఎంతకీ తగ్గదట. ఈ లక్షణాలను ముందుగా గుర్తిస్తే.. ఆ పుండు భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారట. లేదా రేడియో, కీమోథెరపీ చేస్తే కోలుకునే అవకాశం ఉంటుందట. చికిత్స తీసుకోకుండా అలానే వదిలేస్తే పురుషాంగం మొత్తం తీసేయాల్సిన ప్రమాదం ఏర్పడుతుందట. అలా తీసేయని పక్షంలో అది పెరిగి వృషణాలు, ఇతర జననేంద్రియ అవయవాలను తొలగించేందుకు కారణమవుతాయట.

ఇక పురుషాంగ క్యాన్సర్ సోకడంతో, జాన్ పురుషాంగాన్ని జనవరిలో పాక్షికంగా తొలగించారు. అయినప్పటికీ అతనికి మూత్రం పురుషాంగం ద్వారానే బయటికి వస్తుందట. కొన్ని కేసుల్లో పురుషాంగాన్ని పూర్తిగా తొలగించినప్పడు మూత్రాశయ రంధ్రాన్ని వృషణాలకు, మలద్వారానికి మధ్యన ఉన్న పేరీనియానికి మార్చుతారు. దానివల్ల రోగి మూత్ర విసర్జనను కూర్చొని చేయాల్సి ఉంటుంది.

ఇటువంటి క్యాన్సర్ సోకకుండా ఉండాలంటే.. పురుషాంగాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అందులో రకరకాల స్రావాలు ఉత్పత్తవుతుంటాయి కాబట్టి.. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ అలానే వదిలేస్తే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. పరిశుభ్రత పాటించినప్పటికీ.. ఒక్కోసారి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ నోటి, పురుషాంగ క్యాన్సర్లకు కూడా దారితీస్తుందట. హ్యూమన్ పాపిలోమా వైరస్ స్ శరీరంలో వృద్ధి చెందకుండా ఉండాలంటే.. కచ్చితంగా వ్యాక్సిన్లు వేసుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular