Monkey pox : ప్రస్తుతం ఏదో ఒక వ్యాధి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక వైరస్ ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలను కలవర పెట్టడానికి లైన్ గా వస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలను కుదిపివేసిన కరోనా తన రూపాలను మారుస్తూ ప్రపంచాన్ని కబలించింది. ఇక ఇప్పుడు ఇతర దేశాలను వణికిస్తున్న మంకీపాక్స్ ప్రస్తుతం మన దేశానికి కూడా వచ్చేసింది. దీనిపై WHO హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీ అలర్టయ్యారు. ఇంతకీ ఏంటి ఈ మంకీపాక్స్ అనే వివరాలు ఈ ఆర్టికల్ లో చూసేద్దాం.
మంకీ పాక్స్ పై ప్రధాని..
మంకీపాక్స్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ప్రధాని. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని.. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 15,600 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యయట. ఇక 537 మంది మృతి చెందారు. అయితే భారత్‌లో ప్రస్తుతానికి ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు. ఇక విమానాశ్రయాలు, ఓడరేవులు, గ్రౌండ్ క్రాసింగ్‌లలోని ఆరోగ్య విభాగాలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం.
ఎక్కడ మొదలైంది?
తొలుత ఆఫ్రికాకే పరిమితమైన మంకీపాక్స్ క్రమంగా ప్రపంచమంతా వేగంగా వ్యాపిస్తోంది. అందుకే అప్రమత్తంగా ఉండాల్సిదే. లేకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని WHO హెచ్చరిస్తుంది. ప్రస్తుతం చాలా దేశాలకు వ్యాపించింది ఈ వైరస్. పాకిస్తాన్ ను కూడా వణికిస్తుంది ఈ వైరస్.
మొట్టమొదట?
1970లో మొదటిసారిగా మనిషికి సోకింది మంకీపాక్స్. ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఈ వైరస్ ఎక్కువగా కనిపించేదట. దాంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీన్ని నిర్లక్ష్యం చేశారు. తొలిసారి 2022లో భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించడంతో… ఉలిక్కిపడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచడం మొదలు పెట్టాయి. ఫలితంగా గత 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే ఈ రెండేళ్లలో పరిశోధనలే ఎక్కువయ్యాయి అని సమాచారం.
ఈ సమస్యను గుర్తించడం దగ్గర నుంచి చికిత్స, నివారణకు సంబంధించి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి.. 2022-23లో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు రావడంతో ప్రజలు మరింత భయపడ్డారు. ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్రస్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది.
ప్రపంచ దేశాలు సమన్వయంతో పని చేయాల్సిన సమయం వచ్చిందనే చెప్పాలి. ప్రపంచంలో ఏదో ఒక మూల ఈ అంటువ్యాధి వచ్చిందని, మిగిలిన దేశాలు నిర్లక్ష్యం చేస్తే కచ్చితంగా వైరస్ కరోనా మాదిరి విస్తరిస్తుంది. మంకీపాక్స్‌లో రెండు వేరియంట్లు ఉంటాయట. వీటిని క్లాడ్-1 (కాంగోబేసిన్ క్లాడ్), క్లాడ్-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్) గా చెబుతున్నారు.
మొదటిది అంటే క్లాడ్-1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యుమోనియా, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మరణాల రేటు 1-10 శాతం వరకు ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇక క్లాడ్-2 కొంత తక్కువ ప్రమాదకరం అని సమాచారం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే ఉంటుంది కానీ అప్రమత్తంగా ఉండటం బెటర్.